కర్నూల్

రాష్ట్రంలో 16 వేల ఆట స్థలాల నిర్మాణానికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల రూరల్, మార్చి 23:రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో 16 వేల ఆట స్థలాలు కల్పించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర నోడల్ అధికారి, ఏపీ స్పోర్ట్స్ అథారిటీ అధికారి అజయ్‌కుమార్ తెలిపారు. అందులో భాగంగా ఈ నెలాఖరు లోపు రాష్ట్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో 3 వేల ఆట స్థలాల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని పోలూరు, అయ్యలూరు గ్రామాల్లో జరుగుతున్న క్రీడా మైదానాల పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీస వసతులతో కూడిన ఆట స్థలాలు ఏర్పాటు చేసి ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, 200 మీటర్ల రన్నింగ్, తదితర క్రీడల్లో శిక్షణ పొందేందుకు క్రీడా ప్రాంగణానికి రూ. 5 లక్షలు మంజూరు చేస్తుందన్నారు. పోలూరు, చాపిరేవుల, అయ్యలూరు క్రీడా మైదానాలను పరిశీలించామని ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 2018-19 ఏడాదికి రాష్ట్ర వ్యాప్తంగా 5వేల ఆట స్థలాలు మంజూరుకు సిద్ధం చేశామన్నారు. కర్నూలు జిల్లాలో 257 పాఠశాలలను గుర్తించామని, 238 క్రీడా స్థలాలకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 174 పనులు ప్రారంభంలో ఉన్నాయని, 8 పాఠశాలలకు క్రీడా మైదానాలను పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు జరిగాయన్నారు. ఇప్పటి వరకూ జిల్లా, మండల స్థాయిలో క్రీడా ప్రాంగణాలు మాత్రమే ఉన్నాయని, గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామీణులను శారీరకంగా, మానసికంగా ఉంచుతూ విద్యతో పాటు క్రీడల్లో ముందుంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
పంచాయతీల అభివృద్ధికి 14 ఆర్థిక సంఘం నిధులు
* ఇన్‌చార్జి డీపీఓ పార్వతి
మహానంది, మార్చి 23:జిల్లాలోని పంచాయతీల అభివృద్ధికి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 60 కోట్లు మంజూరయ్యాయని జిల్లా ఇన్‌చార్జి డీపీఓ పార్వతి తెలిపారు. డీపీఓ శుక్రవారం మహానంది క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈఓ సుబ్రహ్మణ్యంను కలిసి మహానందిలో డంప్‌యార్డు కోసం స్థలం కేటాయించాలని కోరారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన 14వ ఆర్థిక సంఘం నిధుల్లో 25 శాతం నిధులు సీపీడబ్ల్యూఎస్ స్కీంకు కేటాయించామన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు, వాటర్ సప్లయ్ స్కీంలు, పైపులను క్లీనింగ్ చేయడం ఇతర పనులకు రూ. 1.25 కోట్లు కేటాయించామన్నారు. ఓడీఎఫ్ గ్రామాల్లో మరుగుదొడ్లను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటూ ప్రకృతి సంపద కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి ఇంటింటికీ రెండు చెత్తబుట్టలు అందిస్తామన్నారు. మహానందిలో ప్రభుత్వం చర్యల్లో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేసేందుకు 10 సెంట్ల స్థలం కావాలని ఈఓను కోరామన్నారు. జిల్లాలో ఇంటి పన్నుల వసూలులో రూ 28 కోట్లు డిమాండ్ వుండగా ఇప్పటి వరకూ రూ. 12 కోట్లు వసూలు చేశామని ఈ నెలాఖరులోగా లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. పంచాయతీ కార్యదర్శులు 889 మందికి గానూ 424 మంది మాత్రమే వున్నారని 10 మంది డిప్యూషన్‌పై వున్నారని సిబ్బంది కొరత ఎక్కువగా వుందన్నారు. కొన్ని మండలాల్లో ఒకొక్కరికి 10 గ్రామాలు కేటాయించామన్నారు.