కర్నూల్

కాపీ చీటిలు అందిస్తూ అడ్డంగా దొరికిన నారాయణ స్కూల్ టీచర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, మార్చి 23: పరీక్ష రాస్తున్న నారాయణ స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు బయట నుంచి కాపీ చీటిలు అందిస్తూ ఓ ఉపాధ్యాయుడు అడ్డంగా దొరికిపోయి కటకటాలపాలయ్యాడు. అందుకు సంబంధించి డీఎస్పీ ప్రసాద్, త్రీటౌన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాలు.. ఆదోని పట్టణంలోని నేషనల్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం గది నెంబర్ 9లో నారాయణ స్కూల్‌కు చెందిన విద్యార్థులు కూడా పరీక్షలు రాస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం భౌతిక శాస్త్రం పరీక్ష జరుగుతుండగా కొందరు స్కూల్‌లో పని చేస్తున్న వ్యక్తుల ద్వారా నారాయణ స్కూల్‌కు చెందిన లెక్కలు ఉపాధ్యాయులు గోవిందరాజులు కాపీ చీటిలను గది నెంబర్ 9లో పరీక్ష రాస్తున్న వారి స్కూల్ విద్యార్థులకు అందజేశారు. ఈ విషయాన్ని ఇన్విజిలేటర్ లావణ్య పసిగట్టి వెంటనే పరీక్ష కేంద్రంలో ఉన్న డిపార్టుమెంటల్ ఆఫీసర్ ఉసేన్‌కు తెలుపగా ఆయన వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని కాపీ చీటిలను స్వాధీనం చేసుకుని గోవిందరాజులును అదుపులోకి తీసుకుని త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ తరలించి విచారించారు. గోవిందరాజులుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ విషయంపై ఆదోని డివిజన్ విద్యాధికారి ఈరన్నను వివరణ కోరగా పోలీసులకు దొరికిపోయిన టీచర్ నారాయణ స్కూల్‌కు చెందిన ఉపాధ్యాయుడు కాబట్టి శాఖా పరమైన చర్యలు తీసుకున్నామన్నారు. నారాయణ స్కూల్ యజమాన్యానికి ఫోన్ చేశామని, కానీ వారు అందుబాటులోకి రాలేదన్నారు. కాగా శనివారం నేషనల్ స్కూల్ పరీక్ష కేంద్రం వద్దకు వెళ్లి ఆ సంఘటనపై సమాచారం సేకరిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా కాపీ చీటిలు అందిస్తూ బహిరంగంగా పట్టుపడిన నారాయణ స్కూల్‌పై, ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు.