కర్నూల్

ప్రజలు సమాజసేవకు ముందుకు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, ఏప్రిల్ 25: మారుతున్న కాలంలో కుటుంబ సంబంధాలు దెబ్బతినిపోతున్న తరుణంలో ప్రజలు సమాజసేవకు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందని ఎమ్మెల్యే బీసీ జనార్థనరెడ్డి, రాయలసీమ ఐజీ మహ్మద్ ఇక్బాల్ అన్నారు. బుధవారం మండలంలోని నందవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.40 లక్షల ఖర్చుతో నిర్మించిన ఒక కిలోమీటరు పొడవుగల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీగోడను ఎమ్మెల్యే, ఐజీ, ఎస్పీ గోపీనాథ్‌జెట్టిలు ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ఐజీ మాట్లాడుతూ అన్ని మతాల ఆధ్యాత్మిక గ్రంథాల్లో సమాజ సేవ చేయాలని వుందని, మానవసేవే మాధవ సేవగా తెలిపారు. తాను నందవరం జడ్పీ స్కూల్లో చదువుకుని ఇంతటి వాడినయ్యాయని ఇందుకు ఈ పాఠశాల రుణం తీర్చుకోవలసిన బాధ్యత తమపై వుందన్నారు. పాఠశాల ప్రహరీ గోడలేక ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి మూడు సంవత్సరాల క్రితం తాము 200 బస్తాల సిమెంట్ ఇచ్చి ప్రోత్సహించామన్నారు. అనంతరకాలంలో వ్యాపారులు, మైనింగ్ యజమానులు ముందుకు వచ్చి వారికి తోచిన సహాయం అందించారని, ఎమ్మెల్యే బీసీ రూ.25 లక్షల నిధులను కేటాయించడంతో ఈ భారీ నిర్మాణం శరవేగంగా పూర్తయిందని ఇందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఎస్పీ, పాణ్యం సీఐ, నందివర్గం ఎస్‌ఐలు తమ కార్యక్రమాలకు వారివంతు సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు. సమాజసేవ డబ్బుతోనే చేయాల్సిన పనిలేదని శ్రమదానం ద్వారా కూడా చేయవచ్చన్నారు. విద్య, వైద్యం అన్నివర్గాల వారికి అందుబాటులో వుండాలని, తాము పనిచేస్తున్న చోట్ల ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలను తాము ప్రధానంగా పరిశీలిస్తుంటామని తెలిపారు. నందవరంలో తాము చదువుకున్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ పాఠశాలలో చదువుకుని సివిల్ సర్వీసుకు ఎంపికైన రమేశ్‌కు కూడా భవిష్యత్తులో బడిరుణం తీర్చుకునే కార్యక్రమాలు చేయాలని సూచించారు. పేదరికంతో పిల్లల చదువులు ఆగిపోరాదని, మన దురలవాట్లను మానుకోవడం వల్ల పేద విద్యార్థులకు సహాయం అందించవచ్చని గుర్తించాలన్నారు. ఉపాధ్యాయుల కృషిని కూడా అభినందించారు.
స్వార్థం లేకుండా సేవలు అందించాలి.. ఎమ్మెల్యే బీసీ
స్వార్థ చింతన లేకుండా ప్రజలు సమాజసేవ చేయాలని ఎమ్మెల్యే బీసీ జనార్థనరెడ్డి సూచించారు. ఐజీ ఇక్బాల్ తండ్రి తమకు ఉపాధ్యాయుడని, తమ చిన్ననాటి సంగతులను ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ఐజీ ఇతర శాఖల్లో పనిచేస్తున్నప్పుడు తాము వెళ్లిన ప్రతిసారి ఈ ప్రాంతం సమస్యలు తెలిపేవారని, పట్టుదల, కృషితో ఆయన ఎన్నో సమస్యలు పరిష్కరించారన్నారు. తాము ఓట్ల రాజకీయాలు చేయడంలేదని, అలా అనుకుంటే నందవరంలో తమకు పడిన ఓట్లు తక్కువేనని అయినా ఈ గ్రామంలో రూ.2 కోట్ల వరకు వెచ్చించి సిమెంట్ రోడ్లు, పాఠశాల ప్రహరీకి రూ.25 లక్షలు కేటాయించామన్నారు. నందవరం చౌడేశ్వరీమాత ఆలయం దాతల సహకారంతో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుటుందని, రాష్ట్ర దేవాదాయ కమిషనరే ఆశ్చర్యపోతున్నారని, చైర్మన్ పీవీ కుమర్‌రెడ్డి నిస్వార్థంగా పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. పోలీసుశాఖ వారు బస్‌షెల్టర్లు, పాఠశాలు, వైద్యశాలల వౌళిక సదుపాయాలకు ఎంతో సహకారం అందించారని దాతలను గుర్తించి వారి సహకారంతో సమస్యల పరిష్కారం చేస్తున్నారని అభినందించారు. నందవరం పాఠశాలలో మొక్కల పెంపకానికి తమ స్వంత ఖర్చుతో మొక్కలు సరఫరా చేస్తామని, డ్రిప్ సెట్ కూడా అందిస్తామని ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుని అభివృద్ధికి చేయూత ఇవ్వాలని కోరారు. పాఠశాల తరగతి గదుల నుండి రోడ్డు వరకు సిమెంట్ రోడ్డును కూడా వెంటనే ఏర్పాటు చేయిస్తామని ఎమ్మెల్యే బీసీ హామీ ఇచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ సమాజ సేవలు అందించేందుకు పోలీసు శాఖ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. బడులు, వైద్యశాలలకు ఐజీ చేసిన సేవలను కొనియాడారు. ప్రతిదీ ప్రభుత్వం చేయాలని అనుకోరాదని సహాయం చేయగలవారు ముందుకు వస్తే చాలా వరకు సమస్యలు తీరిపోతాయన్నారు. పెద్ద పనులు కూడా పట్టుదలతో సాగిస్తు అనుకున్న గడువులోగానే పూర్తవుతాయని ఇందుకు నందవరం ప్రహరీగోడ నిర్మాణమే నిదర్శనమన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్థులతో కలిసి ఐజీ, ఎస్పీ తదితర అధికారులను ఘనంగా సత్కరించారు.