కర్నూల్

పోలీసు వ్యవస్థ పటిష్టతకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, ఏప్రిల్ 25: రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వ్యవస్థ పటిష్టత కోసం చర్యలు చేపట్టామని, అదేవిధంగా పోలీసుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి చినరాజప్ప అన్నారు. బుధవారం పట్టణంలోని పోలీసుల నూతన నివాస గృహాల సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా హోంమంత్రితోపాటు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిలు హాజరయ్యారు. పోలీసు క్వాటర్స్ ప్రారంభం అనంతరం ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో హోంశాఖ మంత్రి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ పటిష్టతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 40 పోలీసుస్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో కుటుంబ కలహాలు ఎక్కువయ్యాయని, అలాంటి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కౌనె్సలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోలీసుల ఉత్తమ పనితీరుతో భూకబ్జాలు తగ్గాయని, ఇసుక మాఫియాను అరికట్టామని, ఎర్రచందనం తరలిపోకుండా అడ్డుకట్ట వేశామని, ప్రైవేట్ వ్యాపారుల అధిక వడ్డీల భారం తగ్గించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న పాత పోలీసు క్వార్టర్స్‌ను తొలగించి వాటి స్థానంలో అత్యాధునిక టెక్నాలజీ సాయంతో నూతన భవనాల నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు. కర్నూలు జిల్లా ఒకప్పుడు ఫ్యాక్షన్‌కు మారుపేరుగా వుండేదని, అలాంటి నేపథ్యం నుంచి నేడు ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిందన్నారు. జిల్లాలో 90 ఫ్యాక్షన్ గ్రామాలు వుండేవని, ఆ గ్రామాలను పోలీసులు దత్తత తీసుకుని గ్రామీణుల్లో అవగాహన కల్పించడంతో ఆ గ్రామాలు నేడు ప్రశాంతంగా వున్నాయన్నారు. ఇందులో పోలీసుల కృషి అభినందనీయమన్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ మాట్లాడుతూ రెవెన్యూ, పోలీసుశాఖలు సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. సమాజంలో పోలీసుశాఖ చాలా కీలకమైనదన్నారు. ఎస్పీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత పోలీసులకు కూడా క్వార్టర్స్ నిర్మిస్తే అందుబాటులో వుండి మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం వుంటుందన్నారు. నందికొట్కూరులో 22 పోలీసు క్వార్టర్స్‌ను సుమారు రూ.2కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టామన్నారు. ఆళ్లగడ్డలో కూడా క్వార్టర్స్ నిర్మాణం చేస్తున్నామన్నారు. కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్, పాణ్యం పోలీసుస్టేషన్లను నూతన టెక్నాలజీతో నిర్మిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ ఫ్యాక్షన్ జిల్లాగా వున్న కర్నూలులో పోలీసులు ఫ్యాక్షన్‌ను రూపుమాపడం అభినందనీయమన్నారు.
చినరాజప్పకు కాపుల స్వాగతం : పోలీసు క్వార్టర్స్‌ను ప్రారంభించేందుకు నందికొట్కూరుకు వచ్చిన రాష్ట్ర హోంశాఖ మంత్రి చినరాజప్పకు కాపు సంఘం నాయకుడు మండ్లెం రామిరెడ్డి ఆధ్వర్యంలో కాపు సంఘం నాయకులు స్వాగతం పలికారు.

కొనసాగుతున్న నృసింహ జయంత్యోత్సవం
ఆళ్లగడ్డ, ఏప్రిల్ 25: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో 19 నుండి నృసింహ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ప్రత్యేకంగా కొలువు మండపంలో ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్, అర్చకబృందం అభిషేకం నిర్వహించారు. అనంతరం పట్టువస్త్రాలు, పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. రాత్రి ఉత్సవమూర్తులకు మాఢ వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు.