కర్నూల్

ఫాల్కన్ వాహనంతో నేరాలను అదుపు చేయవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటి, ఏప్రిల్ 25: ఫాల్కన్ వాహనంతో పోలీసులు నేరాలను అదుపు చేయవచ్చని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు మైదానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఫాల్కన్ వాహనాన్ని చిన్నరాజప్పతోపాటు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం శాఖ మంత్రి మాట్లాడుతూ నేరం జరిగిన అనంతరం చర్యలు తీసుకోవడం కన్నా వాటిని ముందుగానే గుర్తించి వాటి నివారణకు కృషి చేయడమే ఫాల్కన్ వాహన సేవాలను ప్రారంభించామన్నారు. రాష్ట్రంలోకెల్లా అత్యంత అధునాతన రక్షణ సౌకర్యాలు కల్గిన ఫాల్కన్ (్ఫల్డ్ అలెర్ట్ సెంటర్ ఫర్ ఆపరేషన్ నెట్ వర్కింగ్) మొబైల్ కమాండ్ పోస్టు వాహనాన్ని కర్నూలులో ప్రారంభించడం జరిగిందన్నారు. ఫాల్కన్ రూపొందించిన సంస్థ ప్రతినిధి వై.శ్రీనివాసరావును మంత్రి అభినందించారు. శాంతిభద్రతల విషయంలో టెక్నాలజీకి ముఖ్య ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగిందని అన్నారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, బాడీ ఓస్ కెమెరాలు యాప్ తో నిఘా ఉపయోగించాలనే ఆలోచనలో ఉన్నారని అన్నారు. గతంలో చిత్తూరు జిల్లా డీఐజీ శ్రీనివాసు ఫాల్కన్ వాహనం ప్రవేశపెట్టారని తెలిపారు. ఉద్యమాలు, పండగలు, విపత్తులు తదితర సంఘటనలు జరిగినపుడు 3కి.మీ రేంజ్ నుండే హెడ్ క్వార్టర్ కమాండ్ కంట్రోల్‌కి సమాచారం అందిస్తుందని అన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ ఫాల్కన్ వాహనం ద్వారా 3కి.మీ నుండే రాబోయే రోజుల్లో ధర్నాలు, జాతర, పుష్కరాలు, ఉద్యమాలు జరిగినపుడు అక్కడ ఎవరైనా అనుమానిత వ్యక్తులను గుర్తించడానికి చాలా ఉపయోగకరంగా ఉందని అన్నారు. దీని ఖరీదు కోటి రూపాయలని తెలిపారు. ప్రమాదాలకు గురి చేసి వెళ్లే వాహనాలను ఛేధించుటకు ఈ వాహనం ఉపయోగపడుతుందని అన్నారు. ఫాల్కన్ వాహనంలో 4 అత్యాధునిక కంప్యూటర్లు, సీసీ కెమెరాలను మానిటరింగ్ చేయుటకు ఇందులో ఏర్పాటు చేయబడ్డాయని అన్నారు. 16 టెరా టైట్స్, 8టెరా టైట్స్ సామార్థ్యం గల రెండు సర్వర్లను అమర్చారు, హెచ్‌డీ పీటీజెడ్ సీసీ కెమెరాలు రెండు ఉన్నాయి, ఇందులో ఫిక్స్‌డ్ పీటీజెడ్ కెమెరా, పోర్టబుల్ పీటీజెడ్ కెమెరాలు ఉన్నాయి.