కర్నూల్

గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఏప్రిల్ 26:రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధికి రాబోయే మూడేళ్లలో రూ. 675 కోట్లు ఖర్చు చేయనుందని రాష్ట్ర గొర్రెల, మేకల పెంపకందారుల సమాఖ్య చైర్మన్ వై.నాగేశ్వరరావు యాదవ్ పేర్కొన్నారు. ఆయన గురువారం అమరావతిలో పదవీ బాధ్యతలు చేపట్టి, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గొర్రెల పెంపకందారుల సహకార యూనిట్లు 2,522 ఉండగా అందులో దాదాపు 1.5 లక్షల మంది పెంపకందారులకు సభ్యత్వం ఉందన్నారు. విభజన జరిగిన తర్వాత ఏపీ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్యను గుంటూరులో ఏర్పాటు చేశారన్నారు. జాతీయ సహకార అభివృద్ధి న్యూఢిల్లీ వారి ద్వారా గొర్రెల పెంకందారుల కోసం జీవాల కొనుగోలుకు రూ. 275 కోట్ల రుణ సౌకర్యం కల్పించారని, అందులో రూ. 61 కోట్లను ఏప్రిల్‌లో అన్ని జిల్లాల్లో విడుదల చేస్తామన్నారు. అలాగే పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా జీవాలకు ఏడాదిలో 3 నుంచి 4సార్లు నట్టల నివారణ కార్యక్రమం చేపడుతామన్నారు. అలాగే వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. అంతేకాకుండా రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేసి తద్వారా సన్న జీవాలను సరసమైన ధరల లభ్యత కొరకు కృషి చేస్తామన్నారు. పశు వైద్య సేవలు అందించేందుకు సహకార సంఘాల ద్వారా జీవ మిత్రల వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. పశుగ్రాసం కొరత నివారణకు పాతర గడ్డి, టీఎంఆర్‌ను జీవాలకు కూడా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జీవాలకు నివాస వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చేయి చేయి కలిపితే సాధించ లేనిది ఏదీ లేదని, సహకార స్ఫూర్తితో పని చేసేందుకు గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలను రాష్ట్ర సమాఖ్య ద్వారా కార్యోణ్ముఖులను చేస్తుందన్నారు.