కర్నూల్

త్వరలో మంత్రాలయం-కర్నూలు రైల్వేలైన్ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఏప్రిల్ 26: త్వరలో మంత్రాలయం- కర్నూలు రైల్వేలైన్ సర్వే పనులను చేపడుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ స్పష్టం చేసినట్లు ఎంపీ బుట్టారేణుక అన్నారు. గురువారం జనరల్ మేనేజర్‌ను ఆయన కార్యాలయంలో ఎంపీ కలిసి వివిధ సమస్యలపై చర్చించారు. మంత్రాలయం- కర్నూలు రైల్వే లైన్ సర్వేతోపాటు కర్నూలులో మీడ్‌లైఫ్ కోచ్ రిహాబిలిటేషన్ వర్క్‌షాపు పనులు కూడా ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జీఎం తెలిపారని ఆమె పేర్కొన్నారు. అలాగే కర్నూలు నుంచి రాజధాని అమరావతికి రైలు, మహబూబ్‌నగర్ నుంచి డోన్ వరకు డబ్లింగ్ రైల్వేలైన్ పనులు గురించి కూడా జీఎంను అడిగినట్లు తెలిపారు. అదేవిధంగా నవంబర్ నెలలో ఇస్తేమాకు ప్రత్యేక రైలు ఏర్పాటు గురించి కూడా జీఎంతో చర్చించినట్లు తెలిపారు. మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని జీఎం హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.
సర్వజన ఆసుపత్రి అభివృద్ధికి కృషి
* డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
కర్నూలు సిటీ, ఏప్రిల్ 26:నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రూ. 2కోట్లతో చేపడుతున్న అంతర్గత సీసీ రోడ్లు, రూ. 1.5కోట్లతో గ్యాస్ట్రో విభాగంలో చేపడుతున్న పనులను గురువారం కేఈ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, కలెక్టర్ సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఆసుపత్రి ఆవరణలో గతంలో పందుల బెడద తీవ్రంగా ఉండేదని, వాటిని లేకుండా చేయడం హర్షిందగ్గ విషయమన్నారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చితే దోమలు వ్యాప్తి చెందవని, పందులకు కూడా నివాసం లేకుండా పోతుందన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎంపీ టీజీ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అత్యాధునిక పరికరాలతో ఆపరేషన్స్ చేస్తున్నారన్నారు.