కర్నూల్

కామేశ్వరీదేవి ఆలయ హుండీలో పొగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, ఏప్రిల్ 26: మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీ కామేశ్వరి అమ్మవారి ఆలయంలోని హుండీలో గురువారం పొగలు వచ్చాయి. హుండీలో మంటలు ఏర్పడి భక్తులు సమర్పించిన కానుకలు, నగదు కాలిపోయాయి. హుండీలో ఒక్కసారిగా పొగలు రావడంతో అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తమై నీరుచల్లి, ఇసుకను పోశారు. ఘటనా స్థలాన్ని అధికారులతో పాటు ఎస్‌ఐ పెద్దయ్యనాయుడు పరిశీలించారు. కాగా పూజారులు హారతి ఇస్తుండగా రవ్వలు చిట్లి హుండీలో పడినట్లు తెలిసింది. రవ్వలు చిట్లడంతో హుండీలో పడ్డాయి. భక్తులు సమర్పించిన కానుకల నోట్లు కాలి పొగలు వ్యాపించినట్లు తెలిసింది. హుండీలు తెరిచి పరిశీలిస్తేగాని పూర్తి వివరాలు తెలియరావు. ఈఓ సెలవుపై ఉండడంతో అధికారులు హుండీలు తెరువలేదు. దీనిపై ఆలయ అధికారులతోపాటు పోలీసులు విచారణ చేస్తున్నారు.