కర్నూల్

14 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, మే 3:పట్టణానికి 2 కి.మీ దూరంలోని మిట్టపల్లె గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి అందర్‌బాహర్ స్థావరంపై పోలీసు బృందాలు దాడి చేసి 14 మందిని అరెస్టు చేసినట్లు డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్ తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాలు.. అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ జయన్న, పోలీసు సిబ్బంది ఆ స్థావరంపై దాడులు చేశారు. ఆ దాడుల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 14 మందిని అరెస్టు చేయడమే కాకుండా వారి నుంచి రూ. 7,20,500 నగదు, ఒక కారు, 10 సెల్‌ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో బనగానపల్లెకు చెందిన శ్రీనివాసులు, సుదర్శన్‌రెడ్డి, మండల పరిధిలోని మిట్టపల్లెకు చెందిన శివనాగిరెడ్డి, పండ్లాపురానికి చెందిన వెంకటరంగయ్య, చౌడయ్య, ప్యాపిలికి చెందిన అనిమిరెడ్డి, అనంతరం జిల్లా తాడిపత్రికి చెందిన నాగిరెడ్డి, సంజామల మండలం రామిరెడ్డిపల్లెకు చెందిన ఓబులేసు, కర్నూలుకు చెందిన ఇద్రూస్‌బాషా, వెంకటేశ్వర్లు, షేక్‌అబ్దుల్లా, విజయకుమార్, సయ్యద్‌అహ్మద్‌బాషా, నంద్యాలకు చెందిన రామలింగేశ్వరరెడ్డి ఉన్నారు. పేకాట, గ్యాంబ్లింగ్, మట్కా వంటివి చట్ట వ్యతిరేకమైనవి అని ఎవరూ ఆడరాదని హెచ్చరించారు. జిల్లా సరిహద్దులైన బనగానపల్లె-తాడిపత్రి, గుత్తి-ప్యాపిలి, పత్తికొండ-గుంతకల్లు మధ్య ప్రాంతాల్లో ఎక్కువగా పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉందిందని ఆయా ప్రాంతాల్లో కూడా దాడులు జరుగుతాయన్నారు. ఎవరైనా పట్టుబడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని తెలిపారు. డీఎస్పీతో పాటు ఎస్‌ఐలు జయన్న, విజయలక్ష్మి, పోలీసులు ఉన్నారు.
పలుకూరులో ఆరుగురి అరెస్టు
నందివర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలుకూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపారు. పలుకూరుకు చెందిన బాలుడు, దస్తగిరి, సింగారపు వెంకటేశ్వర్లు, ప్రసాద్, మహేశ్, వడ్డే వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే వారి నుంచి రూ. 3,260 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.