కర్నూల్

సామాన్యులకు నగదు కష్టాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేతంచెర్ల, ఏప్రిల్ 26 : సామాన్యులకు కనీస అవసరాలైన విద్య, వైద్యం, తదితరాలకు ఏటీఎంలో నగదు దొరకదు కానీ విజయ్ మాల్యా, లలిత్‌మోదీ, నీరవ్‌మోదీ లాంటి వారు బ్యాంకుల్లో రూ. లక్షల కోట్లు అప్పులు చేసి విదేశాల్లో దాచుకున్నా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారిని ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడడు, ఇది ప్రస్తుతం దేశంలో బీజేపీ పాలన అని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాల పట్ల రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై టీడీపీ చేపట్టిన ధర్మ పోరాటంలో భాగంగా గురువారం మండల పరిధిలోని ఆర్‌ఎస్ రంగాపురంలో డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కేఈ ఆధ్వర్యంలో జరిగిన సైకిల్ యాత్రలో డిప్యూటీ సీఎం కేఈ పాల్గొన్నారు. తొలుత కేఈ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, మండల ఇన్‌చార్జి బుగ్గన సంజీవరెడ్డితో కలిసి పట్టణంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేకహోదాతో పాటు విశాఖకు పారిశ్రామికవాడ, రైల్వేజోన్, అమరావతి నిర్మాణం కోసం నిధులు వంటి వాటిపై సీఎం చంద్రబాబు 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా కేంద్రం ఏమాత్రం సాయం అందించలేదన్నారు. దీంతో ఇక లాభం లేదని కేంద్రంపై వత్తిడి తెచ్చి రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలతో పాటు భవిష్యత్తు తరాల కోసం ప్రత్యేక హోదా సాధించేందుకు సీఎం చంద్రబాబు పోరాడుతుండగా ప్రతిపక్ష నేత జగన్ సహకరించకుండా తన కేసులను కొట్టివేయించుకోవడానికి బీజేపీకి కొమ్ముకాయడం ఎంతవరకూ సమంజమని ప్రశ్నించారు. బీజేపీతో పాటు మోదీకి వత్తాసు పలుకుతున్న వైసీపీ, జనసేన పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రం కోసం రోజుకు 18 గంటలు పని చేస్తున్న సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శలు సరికాదన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సీఎం కాలి గోటికి కూడా సమానం కావన్న విషయాన్ని బుగ్గన గుర్తుంచుకోవాలన్నారు. డోన్ నియోజకవర్గంలో కేఈ ప్రతాప్ ఇంటింటికీ టీడీపీ, దళిత తేజం లాంటి కార్యక్రమాలతో గ్రామ గ్రామాన తిరుగుతూ అభివృద్ధి చేస్తుంటే ఎమ్మెల్యేగా గెలిచిన బుగ్గన సహకరించకుండా అడ్డుకోవడం తగదన్నారు. పిట్టకథలు చెప్పి మభ్యపెట్టాలనుకుంటే నమ్మేవారు లేరన్నారు. డోన్‌లో ఈసారి విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. డోన్ నుంచి డబుల్ రోడ్డుకు రూ. 27కోట్లు, మద్దిలేటిస్వామి క్షేత్రం నుంచి యాగంటికి రూ. 5కోట్లు, ఆర్‌ఎస్ రంగాపురంలో అండర్ డ్రైనేజీ కోసం రూ. 7కోట్ల నిధులతో పాటు పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. సంవత్సర కాలంలో బేతంచెర్లకు అవుకు రిజర్వాయర్ నుంచి తాగునీరు తెప్పిస్తామని, రంగాపురంలో ఇంకా మిగిలి ఉన్న అంతర్గత రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం 111 పథకాలను అమలు చేస్తుందన్నారు. టీడీపీ చేపట్టిన ధర్మ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
త్రిపురాంతకంలో ప్రత్యేక పూజలు
శ్రీశైలం టౌన్, ఏప్రిల్ 26: లోక కల్యాణం కాంక్షిస్తూ దేవస్థానం ప్రతి ఏటా వైశాఖ మాసంలో శుద్ధ ఏకాదశి నుండి శుద్ధ చతుర్థశి వరకు శ్రీశైల ద్వారా క్షేత్రాలు అయిన త్రిపురాంతకం, సిద్ధవటం, అలంపూర్, ఉమా మహేశ్వర క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్‌గుప్తా తెలిపారు. ఏప్రిల్ 26 నుండి 30 వరకు ద్వారా క్షేత్రాల్లో పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. గురువారం శ్రీశైల క్షేత్ర తూర్పు ద్వారమైన త్రిపురాంత క్షేత్రంలో త్రిపురేశ్వర స్వామి, బాల త్రిపుర సుందరి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు పట్టువస్త్రాలు సమర్పించినట్లు తెలిపారు.