కర్నూల్

సీఎంను కలిసిన మంత్రి అఖిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఏప్రిల్ 26: రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ సీఎం చంద్రబాబునాయుడును కలిసింది. గురువారం మంత్రి కుటుంబసమేతంగా అమరావతికి వెళ్లారు. కాగా ఆళ్లగడ్డ అసెంబ్లీ పరిధిలో పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు, టీడీపీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డికి మధ్య నెలకొన్న విబేధాల కారణంగా గత ఆదివారం ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన రాళ్లదాడికి సంబంధించిన పంచాయతీ అమరావతిలో గురువారం ఇరువురు పాల్గొన్నారు. ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన దాడికి తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని పార్టీ పెద్దలకు, ముఖ్యమంత్రికి బలంగా తన వాదన వినిపించేందుకు మంత్రి అఖిల సకుటుంబంగా అమరావతికి తరలి వెళ్లారు. మంత్రి అఖిల, ఆమె మేనమామ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, తమ సోదరుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, చెల్లెలు భూమా వౌనికలతో కలసి గురువారం అమరావతికి బయలుదేరి వెళ్లారు. గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ పెద్దలతో జరిగిన చర్చల అనంతరం ముఖ్యమంత్రితో భేటీ జరిగింది. ముఖ్యమంత్రి సమక్షంలో ఆళ్లగడ్డ అసెంబ్లీ పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై వివరించాలని మంత్రి అఖిల తన బలగాన్నంతా వెంటబెట్టుకొని వెళ్లింది. ముఖ్యమంత్రిని కలిసే ముందు మంత్రి అఖిల చెల్లెలు భూమా వౌనిక మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి భూమానాగిరెడ్డి చనిపోయిన నాటి నుండి తమ కుటుంబం వెంట నడిచిన ఏవీ సుబ్బారెడ్డి ఎందుకు విబేధించి వేరు కుంపటి పెట్టారో తమకు అర్థం కావడం లేదన్నారు. ఏవీ సుబ్బారెడ్డిని కాని, ఆయన కుమార్తెలను కాని తాము వేరుగా చూడలేదని, తమ కుటుంబ సభ్యులలాగే చూస్తున్నామని, అయినప్పటికి ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ వేరు కుంపటి పెట్టడంలో ఆయన ఉద్దేశ్యం అర్థం కావలేదన్నారు. ఆళ్లగడ్డ, నంద్యాల అసెంబ్లీ పరిధిలో భూమా కుటుంబానికి మంచి క్యాడర్ ఉందని, ఆ క్యాడర్ ఇప్పటికి తమ వెంటే ఉందని, భూమా కుటుంబ సభ్యులకు ఏదైన జరిగితే క్యాడర్ సహించదన్న విషయం రెండు నియోజకవర్గాల ప్రజలకు స్పష్టంగా తెలుసన్నారు. తన తండ్రి మొదటి వర్థంతి నాడు ఏవీ సుబ్బారెడ్డి, ఆయన కుమార్తెలు రాకపోగా ఆనాటి నుండి తమతో విబేధించి వేరు కుంపటి పెట్టి, ఏవీ హెల్ప్‌లైన్ అంటూ పోటా పోటీ కార్యక్రమాలు చేస్తుండడం దురదృష్టకరమన్నారు. ధర్మపోరాట దీక్ష రోజున అక్క అఖిలప్రియ దీక్షలో ఉండగా ఏవీ వర్గానికి చెందిన వారు దీక్షా శిబిరం వద్ద మోటారు సైకిళ్లపై వచ్చి కేకలు వేసి, అల్లరి చేసిన దానికి బదులుగా భూమా క్యాడర్ రాళ్లదాడి చేసి ఉండవచ్చునేమో తప్ప ఈ దాడి వెనుక భూమా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాళ్లదాడి విషయం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైందని, తమ కుటుంబ సభ్యులందరు విచారణలో పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని, నిజానిజాలు బయటకు వస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మొత్తం మీద ఆళ్లగడ్డ పంచాయతీకి భూమా అఖిలప్రియ బుధవారం హాజరుకాకపోవడంపై రాజధానిలో జరిగిన పరిణామాల నేపధ్యంలో గురువారం ముఖ్యమంత్రితో కలిసేందుకు కుటుంబ సభ్యులందరితో చేరుకున్నారు. ముఖ్యమంత్రి ముందు తమ వాదనను బలంగా వినిపించేందుకు కుటుంబ సభ్యులను వెంట తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.