కర్నూల్

ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 22: ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన నిధులను వారి సంక్షేమానికి సక్రమంగా వినియోగించాలని కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంళశారం 2017-18 ఆర్థిక సంవత్సరంలో జరిగిన సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేసిన వివరాలను కమిటీ సమావేశంలో నివేదికలు సమర్పించాలన్నారు. నివేదికలు అందించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మత్స్యశాఖ 94 శాతం, విద్యాశాఖ 91శాతం, గృహనిర్మాణం శాఖ 144 శాతం, పంచాయితీరాజ్ శాఖ 81శాతం, గ్రామీణాభివృద్ది శాఖ 93 శాతం, తమ ప్రగతిని సాధించాయని అన్నారు. మిగిలిన శాఖల ప్రగతి బాగుందని అన్నారు. నిధులను ఎస్సీ కాలనీల్లో రోడ్లు, కాలువలు, విద్యుత్ తదితర వౌళిక సదుపాయాలు సంక్షేమానికి వినియోగించాలన్నారు. కార్యక్రమంలో సాంఘీక సంక్షేమశాఖ ఉప సంచాలకులు ప్రసాదరావు, డీఆర్డీఎ పీడీ రామకృష్ణ, ఐసీడీఎస్ పీడీ జుబేదా బేగం, ఎపీఎంఐపీ పీడీ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ జేడీ ఉమా మహేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్‌కు నామినేషన్ దాఖలు
కర్నూలు ఓల్డ్‌సిటీ, మే 22:హైదరాబాద్‌లోని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో మంగళవారం ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్‌కు కర్నూలు నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది ఎండీవీ.జోగయ్యశర్మ 4సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది యండీవీ. జోగయ్యశర్మ మాట్లాడుతూ ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు జూన్ 29వ తేదీ జరగనున్నాయన్నారు. తనను గెలిపిస్తే ముఖ్యంగా న్యాయవాదుల సంక్షేమ నిధిని రూ. 3లక్షల నుండి రూ. 10లక్షలకు పెంచేలా కృషి చేస్తానన్నారు. అలాగే సాధారణ ప్రజలకు ప్రభుత్వం చంద్రన్నబీమా ద్వారా కల్పిస్తున్నట్లుగా మేధావులైన న్యాయవాదులకూ బీమా, హెల్త్‌కార్డులు వచ్చేలా కృషి చేస్తానన్నారు. న్యాయవాదుల కక్షిదారుల సమస్యల పరిష్కరం కోసం పోలీస్‌స్టేషన్లకు వెళ్లినప్పుడు వారిపై కేసులు పెట్టకుండా అడ్వకేట్ చట్టంలో న్యాయవాదుల రక్షణ కోసం మార్పు తీసుకొస్తామన్నారు. అలాగే జూనియర్ న్యాయవాదులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు నెలకు రూ. 5వేలు స్ట్ఫైండ్. లైబ్రరీ వంటివి కల్పిస్తామన్నారు.