కర్నూల్

ముస్లిం మైనార్టీలకు టీడీపీ పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మిగనూరు, మే 21: టీడీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు పెద్ద పీట వేసిందని ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ముస్లిం మైనార్టీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముందుగా రంజాన్ మాసం కావడంతో పట్టణంలోని ముస్లిం మైనార్టీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రంజాన్ మాసం పూర్తి అయ్యేంతవరకు మసీదుల పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచాలన్నారు. రాష్ట్రప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టందని, వాటిని ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టణంలోని మసీదుల అభివృద్ధికి నిధులను మంజూరు చేయించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. ముస్లిం మైనార్టీలను అన్ని విధాల ఆధుకునేందుకు దివంగత నేత బీవీ.మోహన్‌రెడ్డి పట్టణంలో 70 ఎకరాల్లో ముస్లిం మైనార్టీలకు కాలనీ ఏర్పాటు చేసి పట్టాలు పంపిణీ చేశారన్నారు. ముస్లిం మైనార్టీల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
ప్రజాదర్బార్ వినతులు సత్వరమే పరిష్కరించాలి
* కలెక్టర్ సత్యనారాయణ
నంద్యాల అర్బన్, మే 21: ప్రజాదర్బార్‌కు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. సోమవారం నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ ప్రసన్న వెంకటేష్, జేసీ-2 రామస్వామి, నంద్యాల ఆర్డీఓ రామసుందర్‌రెడ్డిలు బాధితులను నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాదర్బార్‌లో వచ్చిన దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించాలని, సందిగ్ధంగా ఉన్న వాటిని ఆయా మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించి పరిష్కరించాలన్నారు. భూవివాదం గురించి ఆర్‌ఓఆర్ కేసులు, పొలాలకు వెళ్లడానికి రస్తా కావాలని, నంద్యాల పట్టణంలో నీరు సరిగా రావడం లేదని వినతులు వచ్చాయని, వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని వినతిపత్రం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 73 వినతులు అందాయని ఆర్డీఓ తెలిపారు. అనంతరం జరిగిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రజాదర్బార్‌లో కొంత మందికి సొంత గృహాలు లేవని, భూమి కొనుగోలు పద్ధతి ద్వారా భూములు ఇప్పించాలని, మండల కేంద్రాల్లో అంబేద్కర్ భవనాలతోపాటు కమ్యూనిటీ హాలును నిర్మించాలని 6 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.