కర్నూల్

టీడీపీలో కార్యకర్తలకు పెద్దపీట.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, మే 21 : పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్ని అవరోధాలు ఎదురైనా మనోధైర్యం కోల్పోకుండా గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకే పెద్దపీఠ వేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. స్థానిక ఎంఆర్‌సీ భవన్‌లో సోమవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా మహానాడు కార్యక్రమంలో కేఈతో పాటు పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను అమలు చేస్తామని గత 4 ఏళ్లుగా మభ్యపెడుతూ చివరికి మోసం చేశారన్నారు. దీంతో కర్నాటక ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయవద్దని అక్కడి తెలుగు ప్రజలకు పిలుపునివ్వటంతో ఓట్లు వేయలేదన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి పతనం తప్పదని, అందుకు కర్నాటక ఎన్నికలే నాంది అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటిని ప్రవేశపెట్టడంతో సామాన్యులపై తీరని భారం పడుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా చుక్కలనంటుతున్నాయని, దీంతో దేశ ప్రజలు అసహించుకుంటున్నారన్నారు. మోదీని ఓడించే సత్తా తెలుగు వారికే ఉందని, రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని గుర్తుపెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని సూచించారు. చంద్రబాబు తన అపార అనుభవంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా రాజధాని అమరాతి నిర్మాణం చేపడుతుంటే ప్రతిపక్షాలు సహకరించాల్సింది పోయి విమర్శలు చేయడం దారుణమన్నారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడానికి మోదీ పంచన చేరి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న జగన్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే బీజెపీకి వేసినట్లేనని, కావున రాష్ట్భ్రావృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తున్న చంద్రబాబుకు ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు.
మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని వెల్లడించారు. ప్రధాని మోదీ ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా మోసం చేశారని, దీంతో వాటి సాధన కోసం చంద్రబాబు పోరాటానికి నాంది పలికారని, చంద్రబాబుతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. ఇక ఆళ్లగడ్డ రహదారిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని, చికిత్స కోసం నంద్యాల ఆసుపత్రికి రావాల్సి ఉంటుందని, అలాకాకుండా ఆళ్లగడ్డలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేయాలన్నారు. ఎంపీ టీజీ మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలు వెనె్నముక లాంటి వారని, లేని వారిని గుర్తించి ఏదో ఒక ఉపాధి కల్పించాలన్నారు. ముఖ్యంగా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచే చెన్నై వరకూ నీరు పోతుందని, అయితే కర్నూలు నగరంలో మాత్రం నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. కావున జీడీపీ నుంచి పైప్‌లైన్ వేయడమే కాకుండా ప్రత్యేకంగా మరొక సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ ఏర్పాటు చేసి, రైతులను ఇబ్బందికి గురికాకుండా చూడాలన్నారు. ప్రత్యేక హోదా సాధించేంత వరకూ పోరాటం ఆపేది లేదన్నారు. ఇక డోన్‌లో మైనింగ్ కాలేజీతో పాటు మైనింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని తీర్మానాల్లో పెట్టాలన్నారు. జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ ఓర్వకల్లులో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో స్థానికులకే ముందుగా ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడే కనీస మద్దతు ధర నిర్ణయించాలని తీర్మానం చేయాలన్నారు. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మినీ మహానాడు కార్యక్రమాలు నిర్వహించి అక్కడ ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను తీర్మానాల రూపంలో జిల్లా మహానాడులో పెట్టి ఆమోదం తెలిపి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా 32 తీర్మానాలను ఆమోదం కోసం ప్రవేశపెట్టామన్నారు. అందులో ప్రధానంగా చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాటానికి అన్ని నియోజకవర్గాల్లో మద్దతు తెలపాలని తీర్మానం చేసి ప్రత్యేక హోదా సాధన కోసం కృషి చేయాలనే తీర్మానంతో పాటు హంద్రీనీవా ద్వారా చెరువులను నీటితో నింపాలని, వ్యవసాయానికి జాతీయ ఉపాధి హామీని అనుసంధానం చేయాలని, గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, ఆలూరు, పత్తికొండ నియోజక వర్గాల్లో టమోటా జ్యూస్ ప్యాక్టరీ ఏర్పాటు, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులైన వేదావతి, నగరడోన, గుండ్రేవుల, పులికనుమ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆదోని, గూడూరులో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌ల ఏర్పాటు, 60 ఏళ్లు పూర్తి చేసుకున్న రైతులకు పింఛన్లు ఇవ్వాలని, 4 విడతలో రైతు రుణమాఫీ చేయాలని వంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి ఆమోదం తెలిపారన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో విభేదాలను పక్కన పెట్టి సమష్టిగా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.