కర్నూల్

‘మనం-వనం’ మొక్కలకు జియోట్యాగింగ్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, మే 22: మనం-వనం కార్యక్రమం కింద గత ఎడాది నాటిన మొక్కలకు జియోట్యాగింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మొక్కల పెంపకం కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ సమీక్షా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి, సామాజిక అడవుల డీఎఫ్‌ఓ ప్రసూన, డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త ఏడాది కోటి మొక్కల పెంపక లక్ష్యంలో భాగంగా 38.78.లక్షల మొక్కలు మాత్రమే నాటామని ఇందులో మూడు లక్షలకు మాత్రమే జియోట్యాగింగ్ చేసామని అన్నారు. మనం-వనం కింద ఆప్‌లోడ్ చేసిన ప్రతి మొక్కకు జయోట్యాగింగ్ తప్పని సరిగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ఏడాది వర్షాలు ప్రారంభమైన వెంటనే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని అన్నారు. ఈ ఎడాది కోటి మొక్కలు నాటేందుకు అన్ని శాఖలు, ప్రభుత్వ, ప్రభుత్వ ఇతర శాఖలు తమ తమ లక్ష్యాలను నివేదికలు సోషల్ ఫారెస్టు డీఎఫ్‌ఓకు అందజేయాలని అన్నారు. డ్వామా రూ.5లక్షలు, డీఆర్డీఏ 4లక్షలు, అన్ని శాఖలు పాఠశాలలు తమ లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ఇండెంట్ ఇవ్వాలని అన్నారు. స్పెషల్ డెవలప్‌మెంట్ ప్యాకేజి కింద నిధులు మంజూరైన వెంటనే సోషల్ ఫారెస్టుకు నిధులు కేటాయింపుకు చర్యలు తీసుకోవాలని సీపీఓను ఆదేశించారు. మొక్కలు నాటడమే కాకుండా బతికించే బాధ్యతను సంబంధిత సంస్థలు తీసుకోవాలన్నారు. మొక్కకు మొక్కకు దూరంగా నాటితే పెద్ద వృక్షాలు అయిన తర్వాత కొట్టేసే అవసరం ఉండదన్నారు.
గృహ నిర్మాణాల పెండింగ్ బిల్లుల చెల్లింపు
గృహ నిర్మాణాలకు సంబంధిత మార్చి నెలాఖరు వరకూ పెండింగ్‌లో ఉన్న రూ. 28 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారులకు చెల్లించామని కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన బిల్లులు కూడా త్వరలోనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వెంకటేశ్వర్లు, డీఈఓ తాహెరాసుల్తానా, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
పోస్టింగ్ ఇచ్చిన చోట ఆసక్తితో పనిచేయాలి
* పారదర్శకంగా బదీలీల ప్రక్రియ:ఎస్పీ
కర్నూలు, మే 22:బదిలీల ప్రక్రియలో భాగంగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న పోలీసు సిబ్బందికి పారదర్శకంగా బదిలీలు చేపట్టామని ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ స్పష్టం చేశారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న కెఎస్ వ్యాస్ ఆడిటోరియంలో మంళవారం బదిలీల ప్రక్రియ కార్యక్రమం నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలీస్‌స్టేషన్ల ఖాళీలను చూపించి ఖాళీలకు అనుగుణంగా వారు కోరుకున్న స్థానాలకు సిబ్బందిని బదీలీ చేశారు. సిబ్బంది ఎవరు ఎక్కడ అటాచ్‌మెంట్‌లో పని చేస్తున్నారో, ప్రస్తుతం ఏ విధుల్లో కొనసాగుతున్నారో ఏస్పీ అడిగి తెలుసుకున్నారు. బదిలీల కౌన్సిలింగ్‌లో 107 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 20 మంది రిక్వెస్ట్‌లు, 66 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 10 మంది ఏఎస్‌ఐలు పాల్గొన్నారు.