కర్నూల్

దళితుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 22:దళితుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ఇందులో భాగంగానే జి.సింగవరం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. మండల పరిధిలోని జి.సింగవరం గ్రామ సరిహద్దు ప్రాంతంలో రూ. 1.54 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం డిప్యూటీ సీఎం కేఈ కలెక్టర్ సత్యనారాయణ, కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేఈ మాట్లాడుతూ జి.సింగవరం ఎత్తిపోతల పథకం ద్వారా 91 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు చెందిన 150 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందన్నారు. హరిజన, గిరిజనవాడల్లో సిమెంటు రోడ్లు, మురికి కాలువలు, తాగునీటి సరఫరా, ఇతర వౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రభుత్వం దళిత తేజం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దళితుల కోసం అలనాటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ మొదలు పెట్టిన కార్యక్రమాలన్నీ ప్రస్తుత సీఎం చంద్రబాబు చేపట్టి అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. వెనుకబడిన తరగతులు, దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దళితులకు చెందాల్సిన కార్యక్రమాలన్నీ తూ.చ తప్పకుండా నెరవేరుస్తామన్నారు. అలాగే అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు, గృహాలు మంజూరు చేస్తామన్నారు. ఎస్సీలకు చెందాల్సిన ఇరిగేషన్ భూములకు కూడా పట్టాలిస్తామన్నారు. కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే నీటితో రెండు కార్లు పంట వేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న కూలీలు రైతులుగా మారే అవకాశం వుందన్నారు. నీరు అందే పొలాల్లో కూరగాయలు, వ్యాపార పంటలు వేసుకోవాలని కలెక్టర్ సూచించారు. పులకుర్తి, పులికనుమ ప్రాజెక్టులు కూడా పూర్తయ్యాయని త్వరలో ప్రారంభమవుతాయన్నారు.

జగన్‌ది పాదయాత్రా.. దొంగయాత్రా..
* బీసీల అభ్యున్నతి కోసం పుట్టిందే టీడీపీ * జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు
కర్నూలు సిటీ, మే 22:ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ చేస్తున్నది ప్రజా సంకల్ప పాదయాత్రనా లేక దొంగపాదయాత్రనా అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో మంళవారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి ఆరోపణలు చేసే ముందు మీ నాయకుడు జగన్ చేస్తున్నది పాదయాత్రనా లేక దొంగయాత్రనా తెలుసుకుని ఆరోపణలు చేయాలని సూచించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరుగుతుందని, విమర్శలు చేయటం కాదని అక్కడికి వెళ్లి యదార్థ పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. చెరుకులపాడు నారాయణ రెడ్డి వర్ధంతి సభలో అంబటి రాంబాబు మతి లేకుండా డిప్యూటీ సీఎం కేఈ కుటుంబంపై ఆరోపణలు చేయడం తగదని, నారాయణరెడ్డి గురించి పూర్తిగా తెలుసుకుని ఆరోపణలు చేయాలన్నారు. ఎంతోమంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిని అతికిరాతకంగా పొట్టన పెట్టుకున్న నారాయణరెడ్డి వల్ల ఎంతోమంది గ్రామాలను విడిచి నిరాశ్రయులయ్యారని, అలాంటి వారిలో కొందరు నారాయణరెడ్డిని మేమే హత్య చేశామని చెబుతుంటే ఆ హత్యతో కేఈ కృష్ణమూర్తి, ఆయన కుమారుడు శ్యాంబాబుల హస్తం ఉందనడం ఎంత వరకూ సమంజసమన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకెళ్తారని చెప్పే ముందు మీ నాయకుడు జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు వివరించాలన్నారు. ఒక సామాజిక వర్గానికి చెందిన కుటుంబం గురించి ఇంత దిగజారి మాట్లాడిన అంబటి రాంబాబు మీ పార్టీలో ఎంత మంది బీసీలకు న్యాయం చేశారో వివరించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల అభ్యున్నతి కోసమే టీడీపీ పుట్టిందని వెల్లడించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లాలో నియోజకవర్గ, జిల్లా స్థాయి మహానాడు కార్యక్రమాలను కార్యకర్తల అండదండలతో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. అలాగే ఈ నెల 27,28,29 తేదీల్లో విజయవాడలో నిర్వహించే రాష్ట్ర మహానాడు కార్యక్రమానికి జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.