కర్నూల్

టీడీపీ వెంటే ముస్లిం మైనార్టీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, మే 22: రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలందరూ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తారని ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ హిదాయిత్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఓ హోటల్‌లో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లిం మైనార్టీలకు స్వర్ణయుగం లాంటిదేనన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది ముస్లిం మైనార్టీలకు కేటాయించిన బడ్జెట్ పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నాలుగు సంవత్సరాల కాలంలో ముస్లిం మైనార్టీలకు రూ.2,850 కోట్లు మైనార్టీలకు బడ్జెట్ కింద కేటాయించగా 90 శాతం ఖర్చు అయిందన్నారు. రాష్ట్రం విడిపోకముందు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు కేటాయించిన బడ్జెట్ కేవలం రూ.450 కోట్లు మాత్రమేనన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక 2015-16లో రూ.540 కోట్లు, 2016-17కు రూ.710 కోట్లు, 2071-18కి రూ.840 కోట్లు, 2018-19కి రూ.1104 కోట్లు కేటాయించిందన్నారు. ముఖ్యమంత్రి ప్రతి ఏడాది ముస్లిం మైనార్టీలకు బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయిస్తూ వారి అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు కృషి చేస్తున్నారన్నారు. వివిధ పథకాలకు కేటాయించే నిధులు అర్హులైన మైనార్టీలకు చేరేలా రూపకల్పన చేశామన్నారు. దుల్హన్ పథకం ద్వారా పేద ముస్లిం యువతుల వివాహాలకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చెల్లిస్తున్నామన్నారు. మైనార్టీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఎన్‌టీఆర్ విద్యోన్నతి పథకం, విదేశీ విద్యోన్నతి పథకం, ముస్లిం విద్యార్థులకు నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక శిక్షణలు, వౌజన్, ఇమాంలకు గౌరవ వేతనం, రంజాన్ నెలలో ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫాతోపాటు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన పేదలకు స్వయం ఉపాధి పొందేందుకు తక్కువ వడ్డీశాతంతో రుణాలు అందజేస్తున్నామన్నారు. అలాగే విద్యారంగంలో వెనుకబడిన ముస్లిం మైనార్టీ బాలికల కోసం 23 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో విజయవాడ, కడప నగరాల్లో హజ్ హౌస్‌లు నిర్మిస్తున్నామని, వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణతోపాటు వక్ఫ్ ఆస్తుల ద్వారా వస్తున్న ఆదాయంతో హజ్‌యాత్రలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు మైనార్టీల సంక్షేమాన్ని గాలికి వదిలి వారిని ఓటు బ్యాంకుగానే చూసుకున్నారే తప్ప వారి అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేయలేదన్నారు. మైనార్టీలు విద్య పొందడం వల్లనే పేదరికాన్ని నిర్మూలించే అవకాశం ఉండడంతో విద్యా అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆర్థికంగా సమాజంలో అందరితోపాటు సమానంగా గౌరవంగా ఉండేందుకు మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను కట్టుదిట్టంగా అమలుచేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎక్కడా మత కలహాలు చోటుచేసుకోకుండ శాంతిభద్రతలు ఏర్పాటు చేశామన్నారు. అందుకే రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలు అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీతోను, ఆ పార్టీతో జతకట్టిన వైకాపాకు మద్దతు ఇవ్వరని, ముస్లింల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న టీడీపీ వైపే ముస్లీం మైనార్టీలు మొగ్గుచూపిస్తున్నారని ఆయన అన్నారు.