కర్నూల్

కర్నాటక ఎన్నికలకు బాబు రూ. 1000 కోట్లు పంపారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, మే 22: కర్నాటక రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.1000 కోట్లను రాష్ట్రం నుండి తరలించాడని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కపిలేశ్వరయ్య అన్నారు. మంగళవారం ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ కర్నాటక ఎన్నికల అనంతరం గవర్నర్ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరించారని, వివిధ పార్టీలు ఆరోపణలు చేస్తున్నారని, అయితే బలనిరూపనకు ముందే యడ్యూరప్ప శాసన సభ సాక్షిగా రాజీనామా సమర్పించి ప్రజాస్వామ్యాన్ని గౌరవించారనిన్నారు. చంద్రబాబునాయుడు ఎన్నికల ఫలితాలకు ముందు కర్నాటకలో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని అక్కడ ప్రజలకు తాము చెప్పలేదని ప్రకటన చేశారని, అయితే ఆతరువాత ఆయన మాట మార్చారన్నారు. యూటర్న్ తీసుకోవడం చంద్రబాబుకు అలవాటు అని అన్నారు. కర్నాటక ఎన్నికల అనంతరం చంద్రబాబునాయుడు మాటమార్చి తమపార్టీ ప్రచారం చేయడం వల్ల కర్నాటకలో బీజేపీ ఓడిపోయిందని ప్రకటనలు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. కర్నాటకలో ప్రజాస్వామ్యాన్ని మంట కలపారని చేస్తున్న విమర్శల్లో నిజంలేదన్నారు. ప్రజలు తమ పార్టీకి కర్నాటకలో 104 శాసన సభ సీట్లను ఇచ్చి ఆదరించారన్నారు. జాతీయ నాయకుడని చెప్పుకుంటున్న తెలుగుదేశం చంద్రబాబునాయుడు ఎందుకు ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడంలేదని ప్రశ్నించారు. వారికి, వారి నాయకులకు నిజంగా సత్తా ఉంటే ఇతర రాష్ట్రాల్లో పోటీచేసి గెలువాలని ఆయన సవాల్ చేశారు. 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీని విమర్శించడం చంద్రబాబుకు తగదన్నారు. అలాగే బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని, తెలుగుదేశం నేత చంద్రబాబాబునాయుడు ఇతర పార్టీల నేతలు చెప్పడం చాలా హాస్యస్పందమన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని గురించి పదేపదే చెబుతున్నారని, అయితే వైకాపా ఎమ్మెల్యేలు 36 మందిని పార్టీలో చేర్చుకుని వారికి మంత్రి పదవులు ఇచ్చి ప్రజాస్వామాన్ని మంట గలిపారని విమర్శించారు. స్వయంగా తనకు కూతురును ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుకు ఉందన్నారు. రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న ఆయన రాష్ట్ర రాజధాని అమరావతి కోసం కేటాయించిన 35వేల ఎకరాలను అమ్ముతున్నాడన్నారు. ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు సీఎం చంద్రబాబునాయుడుకు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి లేదన్నారు. జిల్లాలో పదేపదే హంద్రీనీవాతో చెరువులు నింపుతామని ప్రకటనలు చేస్తున్నారని, అయితే ఆ చెరువులు ఎక్కడ ఉన్నాయి. ఆ చెరువుల్లో నీటిని నిలువ చేసే సామర్థ్యం ఎంత ఉందో బయటకు తెలియజేయాలన్నారు. టీడీపీ నాయకులకు బీజేపీని విమర్శించే అర్హత లేదన్నారు. కర్నూలులో హైకోర్టు బేంచ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన బాబు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా పేరుతోకేంద్ర ప్రభుత్వంపై తమ వైఫల్యాలను నెట్టి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. జిల్లాలో ఉన్న 9 నీటి పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం సాగుతున్నాయే తప్ప రాష్ట్రప్రభుత్వం జిల్లాలో ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.