కర్నూల్

రైతులు సాంకేతిక విజ్ఞానంతో మార్కెట్ పెంచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 25: ప్రపంచంలోవున్న ఆధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుని రైతులు మార్కెట్ సౌకర్యాన్ని పెంచుకోవాలని కలెక్టర్ సత్యనారాయణ చెప్పారు. శుక్రవారం ప్రభుత్వ అతిథిగృహంలోని కాన్ఫరెన్స్ హాలులో మాస్టర్‌కార్డు సౌజన్యంతో డిజిటల్ ప్లాట్‌ఫాం-్ఫర్మర్‌నెట్ వర్క్ వర్కుషాపుజరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంట చేతికి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో ఐతులు నష్టపోతున్నారన్నారు. ఇతి సరైంది కాదని ప్రభుత్వం భావించి రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించి మాస్టర్ కార్డు ద్వారా ఆదుకోవాలని ప్రభుత్వం ఈ కార్యక్రామానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగానే సోలార్ డ్రయ్యర్స్, శీతల గిడ్డంగులు, ప్రొసెసింగ్ యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. మార్కెటులో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక డిజిటల్ అగ్రి-ప్లాట్ ఫాంన్ ఉపయోగించుకుంటే సత్పలితాలు వస్తాయన్నారు. ఇందుకు రైతు ఉత్పత్తిదారుల సంఘం కింద వున్న రైతులందరికీ ఈ డిజిటర్ ప్లాట్‌ఫాంలో అనుసంధానం చేసుకోవాలన్నారు. బ్యాంకర్లు, బయ్యర్లు కూడా ఇందులో ఉంటారని తెలిపారు. ఎప్పటికప్పుడు దీని ద్వారా మార్కెటింగ్, వాతావరణం, లాజిస్టిక్ తదితర విషయాలను తెలుసుకొని మన ఉత్పత్తులను అత్యంత ధర చెల్లించినవారికి విక్రయించుకోవచ్చునని తెలిపారు.