కర్నూల్

ప్రలోభాలకు లొంగిపోయారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 6: అధికార తెలుగుదేశం పార్టీ పెట్టిన ప్రలోభాలకు తమ పార్టీ తరపున విజయం సాధించిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన రెడ్డి లొంగిపోయారని వైకాపా జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి ఆరోపించారు. కర్నూలు పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్యలతో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కోట్ల రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబు కొంటున్నారని మండిపడ్డారు. తమ పార్టీని వీడి టిడిపి చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు వ్యక్తులను చూసి కాదని వైకాపా, జగన్‌పై నమ్మకంతో ఎన్నో ఆశలను పెట్టుకొని విజయాన్ని అందించారని ఆయన అన్నారు. వారి ఆశలను వమ్ము చేస్తూ పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు తమ స్వశక్తి, టిడిపిపై విశ్వాసం ఉంటే తక్షణం పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. పార్టీని వీడుతూ వైకాపాపై అనవసర అభాండాలు వేయడం తగదని ఆయన తెలిపారు. ఎంత మంది ఎమ్మెల్యేలు వీడినా కార్యకర్తలు తమ వెంటే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పని చేసి జిల్లాలో వైకాపాకు తిరుగులేని విజయాన్నందిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైకాపా నేతలు కొత్తకోట ప్రకాశ్ రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు నరసింహ యాదవ్, తెర్నేకల్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.