కర్నూల్

సీసీ రోడ్ల నిర్మాణాలు సెప్టెంబర్‌లోపు పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 25: పంచాయతీరాజ్‌శాఖ ద్వారా చేపట్టిన అంతర్గత సిమెంటు రహదారుల నిర్మాణ లక్ష్యాన్ని సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో పూర్తి చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సత్యనారాయణ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ భవన్‌లో పంచాయతీరాజ్ చేపట్టిన నిర్మాణ పనులపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో 225 కిమీ సిమెంటు రోడ్ల లక్ష్యాన్ని సెప్టెంబర్ నాటికి పూర్తి చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులను వారపు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. నియోజకవర్గాలవారీగా పంచాయతీరాజ్ నిర్మాణాలను పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేపట్టిన ప్రతి పనికి ఏ గ్రాంటు కింద విడుదలైనది, పొడవు, వెడల్పు విస్తీరం సంబంధిత వివారలను బోర్డులపై సూచిస్తూ ప్రదర్శించాలన్నారు. ఏ ఒక్క పనికి బోర్డు ప్రదర్శించలేదని అసహనం వ్యక్తం చేస్తూ చేపట్టిన అన్ని పనులు బోర్డులు ప్రదర్శించాలని లేని పక్షంలో సంబంధిత ఏఈలను సస్పెండ్ చేసేందుకు వెనుకాడమన్నారు. సీసీరోడ్లు, డ్రైయన్ల నిర్మాణంలో బిల్లుల చెల్లింపులో ఆలస్యం లేనప్పుడు పనులు వేగవంతంగా పూర్తి చేసుకోవాలన్నారు. గ్రౌండింగ్‌లో వున్న పనులను ఏ రోజుకా రోజు అప్‌డేట్ చేస్తూ వారపు, నెలవారి లక్ష్యాన్ని సాధించాలన్నారు. గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణంలో కూడా జాప్యం జరుగుతోందని, నిర్మాణంలో ఉన్న భవనాలన్నీ ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రత్యేక అభివృద్ధి నిధులు, ఎన్‌ఇర్‌ఈజీఎస్, ఎంపీలాడ్స్, 14వ ఆర్థిక సంఘం, నాబార్డు నిధుల కింద మంజూరైన పనులు, నిర్మాణ పురోగతిలో వున్న వివరాలపై నివేదికలు అందజేయాలన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో మంజూరైన 170 కిచెన్ షెడ్ల నిర్మాణం పనులకు ఎస్టిమేట్స్ నివేదికలు సమర్పించి వచ్చే నెల 2వ వారంలోగా పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత డివిజన్ ఈఈలను కలెక్టర్ ఆదేశించారు. పీఎంజీఎస్‌వై పథకం కింద చేపట్టిన పనుల ప్రగతి అధ్యాన్న రీతిలో వుందన్నారు. వారంలో ఒక రోజు తాను చేపట్టిన నిర్మాణాలన్నింటినీ తనిఖీ చేస్తానన్నారు. పారామీటర్స్ ప్రకారం నాణ్యతలో రాజీపడకుండా ప్రజలు సంతృప్తి చెందేలా నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల, మహానంది, చాగలమర్రి, చిప్పగిరి తహశీల్దార్ కార్యాలయ భవనాలను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్‌ఈ సుబ్బరాయుడు, సీపీఓ ఆనందనాయక్, డీఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.