కర్నూల్

కార్యకర్తల సంక్షేమమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, మే 25: ఏ పార్టీకైన కార్యకర్తలే పార్టీకి వెనె్నముకలాంటివారని, అలాంటి కార్యకర్తల సంక్షేమాన్ని కాపాడడమే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సంక్షేమ నిధి నుండి 104 కుటుంబాలకు నగదు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వారిని ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. అయితే టీడీపీలో పని చేస్తున్న కార్యకర్తకాని నాయకులు కాని మరణిస్తే వారి పిల్లల చదవుకై ఎన్‌టీఆర్ ట్రస్టు ద్వారా మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేశారని, అందులో చదువు కొని ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు. అంతే కాకుండ మరణించిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి అంకిత భావంతో పని చేస్తూ వివిధ కారణాల వల్ల, రాజకీయంగా ప్రత్యర్థుల చేతుల్లో హత్యకు గురైన పార్టీ కుటుంబాల వారు ఆర్థికంగా పేద కార్యకర్తలైన వారు ప్రస్తుతం ఆర్థిక సహాయం పొందిన వారిలో ఉన్నారన్నారన్నారు. ఎంతో మంది మహిళలు తమ కుటుంబ పెద్దదిక్కును కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉంటూ తమ పిల్లల భవిషత్ కోసం పార్టీని ఆశ్రయించి, ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేష్‌ను కలిసి విన్నవించు కోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా టీడీపీలో పని చేస్తూ వివిధ కారణాల వల్ల మృతి చెందిన నాయకులు, కార్యకర్తల కుటుంబాల వారికి పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుండి జిల్లాలోని వివిధ నియోజక వర్గాల్లోని 104 కుటుంబాలకు రూ. 24.50 లక్షలను నగదు రూపంలో ఆర్థిక సహాయాన్ని అందజేశామన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పటికి అన్యాయం జరగదన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరావు యాదవ్, నాయకులు నాగేంద్ర కుమార్, మహేష్ గౌడ్, హనుమంతరాయ చౌదరి, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.