కర్నూల్

చెరువులకు నీరందించేందుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుగ్గలి, మే 26: మండలంలో చెరువులకు నీరు అందించే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. మండలంలో జూన్ 3వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జలహారతి కార్యక్రమంలో పాల్గొంటున్నందున మండల పరిధిలోని జొన్నగిరి చెరువును శనివారం కలెక్టర్ పరిశీలించారు. అలాగే బహిరంగ సభకు కావాల్సిన స్థలాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల పరిధిలోని చెరువుల్లో నీటిని నింపడం వల్ల గ్రామాల్లో తాగునీటి సమస్య తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఓబులేసు, తుగ్గలి తహశీల్దార్ గోపాల్‌రావు, వీఆర్‌ఓలు జయరామిరెడ్డిలు, తదితరులు పాల్గొన్నారు.
బస్సు ఢీకొని జింక మృతి
క్రిష్ణగిరి, మే 26:వెల్దుర్తి మండల పరిధిలోని నార్లాపురం గ్రామ సమీపంలో కోడుమూరుకు వెళ్లే దారిలో శనివారం బస్సు ఢీకొని జింక మృతి చెందింది. వెల్దుర్తి, క్రిష్ణగిరి పొలాల్లో అక్కడక్కడ జింకలు తిరుగాడుతుంటాయి. ఈక్రమంలో హంద్రీ నదీ కాలువ సమీపంలో కోడుమూరు నుంచి వెల్దుర్తి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సుకు జింక అడ్డుగా వెళ్లింది. దీంతో డ్రైవర్ బస్సుకు బ్రేక్ వేసేలోగా జింకను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన వెంటనే కర్నూలు సెక్షన్ యాపర్లపాడు బీట్ ఆఫీసర్ సమీవుల్లా సంఘటనా స్థలం చేరుకుని జింకను కళేబరాన్ని పరిశీలించారు. ఇక వెల్దుర్తి పశువైద్యాధికారి మాధవి మృతి చెందిన జింకకు సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అటవీ శాఖ అధికారి జింక కళేబరాన్ని కననం చేశారు.