కర్నూల్

తంగెడంచ మెగా సీడ్‌పార్కులో ఖరీఫ్‌లో విత్తనోత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూపాడుబంగ్లా, మే 26:తంగెడంచ రాష్ట్ర విత్తనోత్పత్తి క్షేత్రంలో అమెరికా అయోవా సంస్థ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయబోయే మెగా సీడ్‌పార్కులో వచ్చే ఖరీఫ్ సీజన్‌లో విత్తనోత్పత్తి ప్రారంభం అవుతుందని వ్యవసాయ శాఖ కమిషనర్ మురళీధరరెడ్డి స్పష్టం చేశారు. తంగెడంచ సీడ్ ఫారంలో శనివారం కమిషనర్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తంగెడంచ రాష్ట్ర విత్తనోత్పత్తి క్షేత్రం భూముల్లో ఏర్పాటు చేయనున్న మెగా సీడ్‌పార్కులో 25 ఎకరాల చొప్పున విభజించి అయోవా సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో స్థానిక వ్యవసాయ నిపుణులు, ప్రైవేట్ విత్తన ఉత్పత్తిదారులు సంయుక్తంగా పంటలు సాగు చేసి ఆ పంటపై వచ్చిన అధునాతన విత్తనాలను రైతాంగానికి సరఫరా చేస్తామన్నారు. తంగెడంచ విత్తన బాంఢాగారానికి కేటాయించిన 626 ఎకరాల్లో ప్రైవేట్ ఉత్పత్తిదారులకు నిబంధనల మేరకు పంటలు పండించేందుకు లీజుకు ఇస్తామన్నారు. కానీ ఈ భూమిపై ఎవరికీ పూర్తిస్థాయి హక్కులు వుండవని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోనే వుంటాయన్నారు. ప్రస్తుతం విత్తనోత్పత్తికి రూ. 10 కోట్లు మంజూరయ్యాయన్నారు. త్వరలోనే పంటలు పండించేందుకు అవసరమైన సాగునీటి ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రభుత్వం ఈ సంస్థ అభివృద్ధికి అవసరమైన ఇంటర్నల్ రోడ్లు, 135 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, నంద్యాల నుంచి తంగెడంచ వరకూ రోడ్డు సౌకర్యం లాంటి వౌలిక సౌకర్యాల కల్పన కోసం వివిధ శాఖల అధికారులు ప్రభుత్వానికి రూ. 135 కోట్లతో నివేదిక పంపారన్నారు. విత్తన బాంఢాగారం ఏర్పాటులో కొంత జాప్యం జరిగింది వాస్తవమేనని, యావత్ ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ విత్తనోత్పత్తి క్షేత్రం ఏర్పాటు చేయడం వల్ల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకునేందుకు సమయం పట్టిందన్నారు. అయోవా సంస్థలో ఐదుగురు సభ్యులు వుంటారని, ఇందులో ఏపీ సీడ్స్ అగ్రికల్చర్ ఎండీ బాలకృష్ణ, ఐఏఓ సభ్యులు వరప్రసాద్, నిరంజన్‌తో పాటు దామోదరనాయుడు, డిప్యూటీ రిజిస్ట్రార్ అండ్ అడిషనల్ డైరెక్టర్ రవికుమార్ వుంటారన్నారు.