కర్నూల్

ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకొస్తావా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 26:ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం పొందిన వదంతులు ఒకరిద్దరు ప్రాణాలు బలిగొన్నాయి. దీంతో సామాజిక మాధ్యమ తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయి తే అదే సామాజిక మాధ్యమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు చేస్తున్న ప్రచారం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆంగ్ల మాధ్యమంలో తాము విద్యాబోధన చేస్తామని అది కూడా ఉచితంగా ఉంటుందని ఆ గట్టు (ప్రైవేట్ పాఠశాల) నుంచి ఈ గట్టు (ప్రభుత్వ పాఠశాల)కు రమ్మంటూ విద్యార్థుల తల్లిదండ్రులను కోరుతూ వేసిన బ్యానర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఇటీవల విడుదలైన ఒక సినిమాలో పాట మొదటి లైన్ ఉపయోగించి చేస్తున్న ప్రచారం ప్రజలను విశేషంగా ఆకర్శిస్తోంది. ఆంగ్ల మాధ్యమంలో తాము విద్యాబోధన అందిస్తున్నామని ఇందు కు తల్లిదండ్రులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని అంతా ఉచితమేనని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆ బ్యానర్‌లో పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలు వసూలు చేసే పలు రకాల ఫీజులు, ఖర్చులను వివరించి వారి బారి నుంచి తప్పించుకుని తమ గట్టుకు చేరాలని వారు విన్నవించారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విధ్యా బోధన ప్రారంభించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ను పెంచుకోవడానికి చేస్తున్న కృషి ప్రజల అభినందనలు అందుకుంటోంది.