కర్నూల్

అర్చకులకు మంత్రి సోమిరెడ్డి క్షమాపణ చెప్పకపోతే ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోనిటౌన్, మే 27: అర్చక, పురోహితులకు భయం, భక్తి లేకుండా పోయిందని వారిని లోపల వేసి నాలుగు తగిలిస్తే తప్పా దారికి రారని రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొనడం దారుణమని ఆయన వెంటనే అర్చక పురోహితులకు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెల్లాల మధుసూధన్‌శర్మ స్పష్టం చేశారు. ఆదివారం బీమాస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అర్చక పురోహితుల పట్ల మంత్రి సోమిరెడ్డి చేసిన ఆరోపణలను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే స్పందించి మంత్రి సోమిరెడ్డిని అదుపులో పెట్టుకోవాలని లేని పక్షంలో చంద్రబాబు ప్రభుత్వంపై కూడా నిరసన ప్రదర్శనలు చేపడుతామని స్పష్టం చేశారు. టీటీడి దేవస్థానం విషయాన్ని అర్చక పురోహితులపై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దిక్షితులు తప్పు చేసి ఉంటే నిరూపించి ఆయనపై చర్యలు తీసుకోవాలే తప్పా ఇలా అర్చక పురోహితులపై, వారి వృత్తిపై ప్రతి ఒక్కరిని ఇబ్బంది పేట్టేల ఆరోపణలు చేయడం తగదన్నారు. దేవాలయాల్లో దేవుని సేవ కోసం అర్చకులు ఉన్నారని అది ఉద్యోగం కాదని వంశ పార్యపర్యంగా వస్తున్న ఆచారమని అలాంటి దానిపై మంత్రి స్థాయిలో ఉండి సోమిరెడ్డి ఆరోపించడం ఆయన దివాళా కోరుతనానికి నిదర్శమని అన్నారు. ఐదు సార్లు ఎన్నికల్లో ప్రజల చేత ఓటమి చవి చూసిన కూడా చివరకు దొడ్డిదారిన మంత్రి పదవి తెచ్చుకుని పదవి వ్యామోహంతో అర్చకులపై ఆరోపణలు చేయడం నీఛమైన చర్య అని అన్నారు. అర్చకులకు పదవీవిరమణ అంటూ ఉండదని వారి చివరి వయస్సులోనే దైవ సేవకు అంకితం అవుతారని అలాంటి వారిని దూషించడం వారి పట్ల అసభ్యంగా మాట్లాడడం శోచనీయమన్నారు. రమణ దీక్షితులు సైతం సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారని మంత్రికి, ప్రభుత్వానికి దమ్ముదైర్యం ఉంటే సీబీఐ విచారణ చేసి చిత్తశుద్దిని నిరుపించుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాని ఇలా బ్రాహ్మణ జాతిపై ఆరోపణలు చేయడం, కించ పరిచే విధంగా మాట్లాడితే ఓర్చుకునే ప్రసక్తే లేదని ఇప్పటికైనా ఆయన బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
భక్తులతో పులకించిన మంత్రాలయం
* శ్రీప్రహ్లాదరాయునికి పల్లకోత్సవం
మంత్రాలయం, మే27: ప్రసిద్ద పుణ్యక్షేత్రం మంత్రాయం భక్తులతో పులకించింది. ఆదివారం శ్రీరాఘవేంద్ర మఠంలో భక్తుల రద్దితో ప్రాకారం కిటకిటలాడింది. పీఠాధిపతి శ్రీసుభుదేంద్రతీర్థులు ఆద్వర్యంలో వేకువజామున స్వామి మూల బృందావనాన్నికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి హారతి ఇచ్చారు. ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాలనుండి వచ్చిన భక్తులు, తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీరాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పీఠాధిపతి శ్రీసుభుదేంద్రతీర్థులు శ్రీమూలరామ, జయరామ, దిగ్విజయరామ, సంతానగోపాలకృష్ణ వాసుదేవామూర్తులకు ప్రత్యేకపూజలు చేసి దూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు పూజలలోపాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీప్రహ్లాదరాయలకు నిర్వహించే గజ, కొయ్య, వెండి, బంగారు, నవరత్న రథోత్సవాలలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.