కర్నూల్

నవ భారత నిర్మాత నెహ్రూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, మే 27:నవ భారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అని జడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి పేర్కొన్నారు. నెహ్రూ వర్ధంతి సందర్భంగా నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రానికి ముందు సామంత రాజుల సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన మహనీయుల్లో నెహ్రూ పాత్ర అమోఘమన్నారు. అలాగే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దిశ, దశలను నిర్ణయించి ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేసిన ఘనత మొదటి ప్రధాని నెహ్రూకే దక్కుతుందన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అలాగే ఆయనకు చిన్నపిల్లలంటే అమితమైన ప్రేమ అని, పిల్లలు కూడా నెహ్రూని చాచా అని పిలిచేవారని, అందుకే ఆయన పుట్టిన నవంబర్ 14వ తేదీని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారని వెల్లడించారు. ప్రతిఒక్కరూ నెహ్రూని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.