కర్నూల్

రైతులకు రుణమాఫీ అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేతంచెర్ల, మే 27:రైతులకు రుణమాఫీ అమలు చేయడంతో పాటు పండించిన పంట దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వాలు పని చేయాలని ఏపీ రైతు సంఘం తూర్పు జిల్లా కార్యవర్గ సభ్యులు వి.సుబ్బరాయుడు డిమాండ్ చేశారు. పట్టణంలోని పుల్లమ్మ కల్లంలో ఆదివారం మండల నాయకుడు రాముడు ఆధ్వర్యంలో రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బరాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులు అన్నివిధాలా సంక్షోభంలో కురుకుపోతున్నా పట్టించుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కంటితుడుపు చర్యలుగా రైతు సంక్షేమం పథకాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. సంక్షేమ పథకాలు కూడా కొందరికే పరిమితం అవుతున్నాయన్నారు. దీంతో ఏడాదికేడాది అప్పుల భారం పెరిగి రైతులు వాటిని తీర్చకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు. ఇకనైనా ప్రభుత్వం రైతులందరూ బాగు పడేలాగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామ నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎద్దుల ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా మంజుల రవి, కార్యదర్శిగా కిష్ణన్న, సహాయ కార్యదర్శిగా గంగ నాగమద్దిలేటి, కమిటీ సభ్యులుగా వెంకట్రాముడు, వేణుగోపాల్, రమణారెడ్డి, నాగేశ్వరరెడ్డి, సుంకన్న, బాలన్న, నారాయణ, ఎల్ల క్రిష్ణ, జోల్లు చిన్నన్న, శేఖర్‌లను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.
రమణ దీక్షితులు అంటే ప్రభుత్వానికి భయం
* రాష్ట్రీయ హిందూసేన అధ్యక్షుడు రామాంజినేయులు
ఆదోని, మే 27: హిందూవులు పరమ పవిత్రంగా పూజించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి సేవలో తరించిన రమణ దీక్షితులంటే ప్రభుత్వం ఎందుకు బయటపడుతోందని రాష్ట్రీయ హిందూసేన అధ్యక్షుడు రామాంజినేయులు అన్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకు రమణ దీక్షీతులపై రాజకీయ నాయకులు ఎదురు దాడి చేయడం అమానుషమన్నారు. మంత్రి సోమిరెడ్డి మాట్లాడిన పదజాలం ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏ తప్పు చేయకపోతే ఎందుకు బయపడుతోందన్నారు. కోట్లాది మంది స్వామివారి భక్తుల అనుమానాలు తీరాలంటే వెంటనే సీబీఐ దర్యాప్తు చేసి తమ నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు. తిరుమల కొండపైన అన్యమత ప్రచారాలు జరిగినప్పుడు, అక్రమాలు చోటు చేసుకున్నప్పుడు మాట్లాడని నాయకులు బ్రహ్మణ పూజారులపై దాడికి దిగితే వారికి అండగా ఉండి రక్షించుకుంటామని ఆయన అన్నారు. హిందువులు భక్తితో తమ స్వంత డబ్బులతో దేవాలయాలు నిర్మించుకుంటే రాజకీయ నాయకులు ఏ హక్కుతో దేవాలయాలపైన పెత్తనం చేస్తున్నారో జవాబు చెప్పాలని కోరారు. సెక్యూలరిజం చేసే నాయకులు చర్చిలు, మసీదుల ఆస్తుల జోలికి వెళ్ళే హక్కు లేనప్పుడు హిందూవుల దేవాలయాలలను అక్రమించడం తప్పు అన్నారు. ఈవిషయంపై డాక్టర్ సుబ్రమణ్యస్వామి, సుప్రీం కోర్టుకు వెళ్ళారని ఈ కేసులో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని చెప్పారు. ఈదౌర్భగ్య పరిస్థితి పోవాలంటే హిందూవులు అందరు మన ధర్మాన్ని రక్షించే నాయకునికి ఓటు వేయాలని కోరారు. పోయి పోయి శ్రీ వెంకటేశ్వరస్వామి పెట్టుకున్నాడని తప్పక శాస్తి అనుభవిస్తారన్నారు.