కర్నూల్

గ్రామాల్లో తీవ్రమైన తాగునీటి ఎద్దడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోనిటౌన్, మే 27: ఆదోని మండలంలోని అనేక గ్రామాల్లో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఏర్పడింది. మండుతున్న ఎండలతో ప్రజలు తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. తుంగభద్ర దిగువ కాలువ ఆధారంగా గ్రామాలతోపాటు ఇతర గ్రామాల్లో కూడా నీటి సమస్య రోజు రోజుకు తీవ్రంగా మారింది. మండలంలోని జాలిమంచి, గణేకల్, పాండవగల్, బసాపురం, పెద్దహరివాణం, సంతేకూడ్లూరు, బైచిగేరి, కపటి, నేట్టేకల్, సాంబగల్, పెద్దపెండేకల్, చిన్నపెండేకల్, దిబ్బనకల్ గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నీటి కోసం ప్రతి రోజు ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్న తాగనీటి పథకాలకు తాగునీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో తాగునీటి తప్పిక తీర్చుకోవడమే రోజంతా పని చేయాల్సిన పరిస్థితి ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఈరన్న, తాయప్ప, బజారి, రాముడు, జానకీరాముడు వాపోయారు. సుమారు 10వేల జనాబా ఉన్న పెద్దహరివాణం గ్రామంలో ఎస్ ఎస్ ట్యాంకు పూర్తిగా ఎండిపోయింది. హొళగుంద మండలం హెబ్బటం నుంచి తాగునీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతోబోరు బావి వద్ద ఉన్న బావిలో నీటిని తోడుకునేందుకు ప్రజలు కూస్తీలు పడుతున్నారు. ప్రతి రోజ నీటి కోసం ఘర్షణలకు కూడా పడుతున్నట్లు గ్రామస్థులు వాపోతున్నారు. అలాగే కుప్పగల్ తాగునీటి పథకం నుంచి పాండగల్, గణేకల్, జాలిమంచి గ్రామాలకు నీరు సరఫరా కాకపోవడంతో గ్రామంలోనీటి వనరులపైన ఆదార పడుతున్నారు. ఉన్న ఒక్క బోరు కూడా గణేకల్ సక్రమంగా పని చేయకపోవడంతో నీటి కష్టాలు తీరచడం లేదు. బసాపురం గ్రామం ఎల్లెల్సీ కాలువకు పక్కనే ఉన్న రెండు ఎస్ ఎస్ ట్యాంకులు ఉన్న కూడా ఎండిపోవడంతో తాగునీటి సమస్య ఏర్పడింది. బైచిగేరి, కపటి, నాగలాపురం, ఆరేకల్, సాంబగల్, పెసలబండ గ్రామాలకు పెద్దకడబూరు మండలం నేమికల్ పథకం నుంచి తాగునీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో నీటి సమస్య తీరడంలేదు. దీంతోప్రజలు తాగునీటి కోసం పొలాల్లోని బోరు బావులను ఆశ్రయిస్తున్నారు. మరి కొంత మంది ఆదోని పట్టణం నుంచి క్యాన్లను కొనుగోలు చేసి తీసుకు వెళ్తున్నారు. గ్రామాల్లో కూడా తాగునీటి శుద్దిపాట్లు ఏర్పాటు చేసి నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు, పాలకులు మాత్రం ఎల్లెల్సీ కాలువకు నీరు లేవని ఉన్న నీటిని సరఫరా చేస్తున్నామని చెబుతున్నారే తప్పా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోతున్నారని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తాగునీటి సమస్య తీవ్రంగ ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని రవాణ చేసి ఆదుకోవాని లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు.