కర్నూల్

నగరానికి పొంచి ఉన్న నీటి ముప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, మే 27:కర్నూలు నగరానికి నీటి ముప్పు పొంచి ఉంది. సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో నీళ్లు అడుగంటిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న నీళ్లు వారం రోజులకు మించి సరిపడవని నగర పాలక సంస్థ అధికారులు తెలుపుతున్నారు. గత ఏడాది లాగా హంద్రీనీవా కాలువ నుంచి గాజులదినె్న ప్రాజెక్టు(జీడీపీ)లోకి నీటిని మళ్లించి అక్కడి నుంచి సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు చేర్చి అక్కడి నుంచి ఫిల్టరేషన్ చేసి నగర వాసులకు తాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది. వాటితో పాటు సుంకేసుల జలాశయం నుంచి కూడా సమ్మర్ స్టోరేజీకి నీటిని మళ్లించి అక్కడి నుంచే నగర పాలక సంస్థ అధికారులు ప్రజలకు నీరు విడుదల చేసేవారు. ప్రస్తుతం హంద్రీనీవా కాలువలో నీళ్లు లేవు. సుంకేసుల జలాశయంలో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో నగర ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రాయలసీమ జిల్లాలకు జీవనాడి అయిన తుంగభద్ర నది ఎండిపోయింది. నదీ తీర గ్రామాలన్నీ తాగునీటి కోసం అల్లాడిపోతున్నాయి. తుంగభద్రను ఆధారం చేసుకుని నిర్మాణం చేపట్టిన సుంకేసుల జలాశయం పూర్తిగా అడుగంటిపోయి డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ఈ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 0.165 టీఎంసీలు మాత్రమే ఉంది. ఎగువ నుంచి ఏమాత్రం నీరు రావడం లేదు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలో సగం కూడా వినియోగించుకునే పరిస్థితి లేదు. 6 లక్షల జనాభా ఉన్న కర్నూలు నగరానికి ప్రధాన తాగునీటి వనరు సుంకేసుల జలాశయమే. ఈ జలాశయం డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో నగర వాసులకు తాగునీటి గండం తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో వర్షాలు కురిస్తే తప్ప తాగునీటి సమస్య తీరే అవకాశం లేదు. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు ప్రధాన నీటి ఆధారమైన తుంగభద్ర జలాశయంలో నీళ్లు పూర్తిగా అడుగంటాయి. తుంగభద్ర నీటి సామర్థ్యం 108.68 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.56 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. తుంగభద్ర డ్యాం నుంచి జిల్లా వాటా ఇంకా 1 టీఎంసీ నీళ్లు రావాల్సి ఉంది. టీబీ డ్యాం పరిధిలో ఎల్‌ఎల్‌సీ కాలువ ద్వారా ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలతో పాటు 196 గ్రామాలకు తాగునీరు అందాల్సి ఉంది. ఇప్పటికే ఎమ్మిగనూరు ఎస్‌ఎస్ ట్యాంక్‌ల్లో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. తుంగభద్ర డ్యాం నుంచి ఎల్‌ఎల్‌సికి నీరు విడుదల చేయాలని ఆ ప్రాంత అధికారులు విన్నవిస్తున్నా టీబీ డ్యాం అధికారులు ఒప్పుకోవడం లేదు. తుంగభద్ర ఎండిపోవడంతో నదీ తీర ప్రాంతాలైన కౌతాళం, కోసిగి, మంత్రాలయం, నందవరం, సి.బెళగల్, గూడూరు వంటి ప్రాంతాల ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. ఒక పక్క సుంకేసుల జలాశయం డెడ్ స్టోరేజీకి చేరుకోవడం, మరోపక్క హంద్రీనీవాలో నీళ్లు లేకపోవడంతో కర్నూలు నగర వాసులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో వరుణుడు సకాలంలో వర్షాలు కురిపించి తాగునీటి కష్టాలు తొలగించాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు.