కర్నూల్

రాత్రిబస కేంద్రాల నిర్వహణలో అక్రమాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 17:నిలువ నీడ లేక అనాథలు, నిరాశ్రయులు, వికలాంగులు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, రహదారుల వెంట, దుకాణాల కట్టలపై నిద్రిస్తూ సేద తీరుతున్నారు. అలాంటి వారికి రాత్రి బస ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పురపాలక సంఘాల పర్యవేక్షణలో రాత్రిబస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 58 లక్షలు కేటాయించింది. మొత్తం 8 రాత్రి బస కేంద్రాలకు గానూ 5 మాత్రమే ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్షలు ఖర్చు చేస్తూ నిరాశ్రయులకు భరోసా కల్పిస్తుండగా నిర్వహణలో కొందరు అవినీతికి పాల్పడుతూ నిధులు దిగమింగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని కర్నూలుతో పాటు ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల పురపాలక సంఘాల్లో 8 నిరాశ్రయ కేంద్రాలు మంజూరయ్యాయి. అనుమతి పొందిన వాటిలో కర్నూలులో 2, ఆదోని 1, ఎమ్మిగనూరు 1, నంద్యాల 2, డోన్ 1 కేంద్రం ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యతలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. కర్నూలులో 2, నంద్యాలలో 1 కేంద్రాలను రెండేళ్ల క్రితం ప్రారంభించగా ఆదోనిలో మార్క్స్ బ్రిగేడియర్ అర్బన్, రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ పేరుతో ఒకటి ప్రారంభించి మరొకటి పెండింగ్‌లో ఉంచారు. ఎమ్మిగనూరులో మదర్ థెరెసా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఒకటి ప్రారంభమైంది. డోన్‌లో ఇప్పటికి వరకూ ప్రారంభానికి నోచుకోలేదు. నంద్యాల 1, ఆదోని 1 కేంద్రాల ఏర్పాటు కలగానే మిగిపోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ 4 పురపాలక సంఘాల్లోని కేంద్రాలు సక్రమంగా పని చేస్తే మరి కొన్నిచోట్ల వీటి ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జిల్లాలో 4 పురపాలక సంఘాల్లో నిరాశ్రయుల కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 50లక్షలు మంజూరు చేసింది. కేంద్రాల వారీగా కర్నూలుకు రూ. 22లక్షలు, ఆదోనికి రూ. 6లక్షలు, నంద్యాలకు రూ. 17లక్షలు, ఎమ్మిగనూరుకు రూ. 6.6లక్షలు, డోన్‌కు రూ. 6లక్షలు మంజూరయ్యాయి. కర్నూలులో 100, ఆదోని, ఎమ్మిగనూరులో 50, నంద్యాలలో 130, డోన్‌లో 50 మంది చొప్పున నిరాశ్రయులు ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. కేంద్రంలో రాత్రివేళ ఆశ్రయం పొందుతున్న ప్రతి ఒక్కరికీ మంచం, పరుపు, దుప్పటి, తలదిండు కవర్‌తో పాటు భోజనానికి ప్లేట్ ఏర్పాటు చేయాలి. రాత్రి భోజనం, ఉదయం టీ, కాఫీతో పటు శారీరక అవసరాలు తీర్చుకోవడానికి నీటి సౌకర్యంతో పాటు మరుగుదొడ్ల సదుపాయం ఉండాలి. కేంద్రంలో వారి బాగోగులు చూసుకోవడానికి నలుగు కేర్ టేకర్లు, ఒక మేనేజర్, వంట మనిషి ఉండాలి. నెలకు మేనేజర్‌కు రూ. 5వేలు, ప్రతి కేర్ టేకర్‌కు రూ. 3,500, వంట మనిషికి రూ. 3,500 జీతం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వేతనాల రూపంలోనే ఏడాదికి రూ. 2.8 లక్షలు ఖర్చు చేస్తూ నిధులను పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. కొన్ని కేంద్రాల్లో కాంట్రాక్టర్లు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కుమ్మక్కై కొంత నిధులు కాజేసి దొంగ బిల్లులు సృష్టించినట్లు విమర్శలు ఉన్నాయి. ఇకనైనా కలెక్టర్ స్పందించి నిరాశ్రయుల నిధులు పక్కదారి పట్టకుండా అడుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.