కర్నూల్

బుగ్గన రాజద్రోహి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, జూన్ 18:ప్రభుత్వ అధికార పత్రాలను దొంగతనంగా ఢిల్లీలో బీజేపీ నాయకుల కాళ్ల ముందు పెట్టిన పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రాజ ద్రోహి అని, వెంటనే ఆయనను పీఏసీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కేఈ ప్రతాప్ డిమాండ్ చేశారు. పట్టణంలోని తన నివాసంలో సోమవారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుగ్గనపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. చట్టరీత్యా అధికార పత్రాలను స్పీకర్, శాసనసభకు తప్ప పీఏసీ చైర్మన్ ఇంకెవరికీ ఇవ్వరాదని, అయితే పత్రాలను బీజేపీ నాయకులకు అందజేసి రాజద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. బీజేపీ నాయకులతో కలిసి వైసీపీ నేతలు డ్రామాలాడుతున్నారని, చంద్రబాబుపై కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీ వేదికగా ఏపీపై కుట్ర జరుగుతోందని, వైసీపీ డ్రామా రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని ఆరోపించారు. రాజద్రోహానికి పాల్పడ్డ బుగ్గన ఆ పదవికి తగరన్నారు. అనంతరం మండలంలోని దేవరబండలో ప్రమాదానికి గురై మృతిచెందిన హరిప్రసాద్‌గౌడ్ కుటుంబానికి రూ. 5 లక్షలు, కొత్తకోటలో అనారోగ్యంతో మృతిచెందిన కుమ్మరి అనసూయ కుటుంబానికి రూ. 2లక్షలు చంద్రన్న బీమా పథకం కింద మంజూరు కాగా కేఈ వారి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, ఎంపీపీ టిఇ లక్ష్మిదేవి, టీడీపీ మండల అధ్యక్షుడు కొత్తకోట శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.