కర్నూల్

బ్యాంకు రుణాలకై రేపు దరఖాస్తుల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, జూన్ 18:వివిధ వర్గాల వారికి బ్యాంకు రుణాల మంజూరుకై ఈ నెల 20వ తేదీ స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎంపీడీఓ వెంకటరెడ్డి సోమవారం తెలిపారు. బనగానపల్లెలోని స్టేట్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు, పలుకూరు బ్రాంచీల పరిధిలోని, సిండికేట్ బ్యాంకు బనగానపల్లె, ఇల్లూరు కొత్తపేట బ్రాంచీల పరిధిలోని గ్రామాల వారి నుంచి 20వ తేదీ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అలాగే 21వ తేదీ ఏపీజీబీ టంగటూరు, గార్లదినె్న, నందివర్గం, బనగానపల్లె శాఖల పరిధిలోని గ్రామాలకు చెందిన వారి నుంచి ఉదయం 11 నుంచి సాయంకాలం 5-30 గంటల వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు, ఓబీసీ, కాపు, తదితర కార్పొరేషన్ల పరిధిలో అర్హులకు రుణాలు మంజూరు చేసేందుకు అధికారులను కలిసి వారి దరఖాస్తులు అందజేయాల్సి వుంటుందన్నారు. ఇందుకు ఆన్‌లైన్ దరఖాస్తు, ఆధార్, రేషన్‌కార్డు, బ్యాంకు పాసు పుస్తకం జిరాక్స్ కాపీలను అభ్యర్థులు వెంట తీసుకురావాల్సి వుంటుందని ఎంపీడీఓ తెలిపారు.
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి:ఎమ్మెల్యే బీసీ
బనగానపల్లె, జూన్ 18:వాహన చోదకులు అందరూ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి సూచించారు. పట్టణంలో సోమవారం రవాణా శాఖ అధికారులు ప్రజల వద్దకే వచ్చి ఎల్‌ఎల్‌ఆర్ అందజేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బీసీ మాట్లాడుతూ అన్ని రకాల వాహనాలు నడిపేవారు అన్ని వయసుల వారు తప్పక డ్రైవింగ్ లైసెన్స్ పొందాలన్నారు. అందుకోసం శ్రమటోర్చి ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మేజర్ పంచాయతీ కేంద్రాల్లో అధికారులు తరచూ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా అందజేస్తారని, డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఎలాంటి అదనపు ఖర్చులు వుండవన్నారు. ఇక అధికారులు చదువుకున్న వారు, చదువురాని వారికి డ్రైవింగ్‌లో మెలకువలు, డ్రైవింగ్ లైసెన్స్ ఆవశ్యకతను వివరించారు. అనంతరం అర్హులకు ఎమ్మెల్యే బీసీ సమక్షంలోనే ఎల్‌ఎల్‌ఆర్‌లు అందజేశారు. కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు శివరామకృష్ణ, రమణ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ అభివృద్ధికి కృషి
పత్తికొండ, జూన్ 18: బీజేపీ అభివృద్ధికి కృషి చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కోట్లాది రూపాయాలు ఖర్చుచేస్తోందని, కార్యకర్తలు ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతానికి చేరే విధంగా కార్యకర్తలు కృషి చేస్తూ పార్టీని అభివృద్ధి చేయాలన్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రంగాగౌడ్, మల్లికార్జున, నాగరాజు, నాగేష్, చిన్న, బ్రహ్మయ్య, మల్లి, తదితరులు పాల్గొన్నారు.