కర్నూల్

ప్రజాదర్బార్ సమస్యలకు సత్వర పరిష్కారం.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూన్ 18: డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజాదర్బార్‌కు వచ్చే వినతులను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. సోమవారం నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి, డీఆర్ డీఏ పీడీ రామకృష్ణ హాజరయ్యారు. నంద్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలకు సంబంధించిన తహశీల్దార్‌లతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా చర్చించి కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ ప్రజాదర్బార్‌కు సాగుభూములను ఆన్‌లైన్ చేయాలని, వితంతు పెన్షన్లు ఇవ్వాలని, అంగవైకల్యం ఉన్న సంతానానికి పెన్షన్ ఇవ్వాలని, గోరుకల్లు గ్రామంలో భూములు ఆన్‌లైన్ చేయించాలని, తమడపల్లెలో కొంత మంది పట్టాలు ఇచ్చినప్పటికి ఇళ్ల స్థలాలు చూపించమని అడిగినా చూపించలేదని, మిలిటరిలో సిపాయిగాపనిచేసి జీవనానికి భూమి ఇవ్వాలని కోరుతూ దాదాపు 16 వినతిపత్రాలు అందాయన్నారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో రుద్రవరం మండలం శ్రీరంగాపురం, ఎల్లావత్తుల గ్రామాల్లో దళితులకు ఇచ్చిన భూములను అగ్రకులాల వారు ఆక్రమించుకున్నారని, మండల కేంద్రాల్లో అంబేద్కర్ భవనాలు నిర్మించాలని, భూమి కొనుగోలు పద్ధతి ద్వారా భూములు ఇప్పించాలని, కస్తురిబా పాఠశాలలో ఏదైన పని కల్పించాలని కోరుతూ 24 వినతిపత్రాలు అందాయన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్డీవో కార్యాలయం ఏవో జయప్రసాద్, డివిజన్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబును కలిసిన చల్లా
అవుకు/కోవెలకుంట్ల, జూన్ 18:పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర చైర్మన్ చల్లా రామక్రిష్ణారెడ్డి సోమవారం రాజధాని అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం చంద్రబాబుని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చల్లా రామక్రిష్ణారెడ్డిని రాష్ట్ర సివిల్ సప్లయ్స్ చైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేయడం, చల్లా ఆ పదవిని స్వీకరించడం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చల్లా సీఎం చంద్రబాబుని మర్యాద పూర్వకంగా కలిశారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. చల్లా చంద్రబాబుని కలిసిన సందర్భంగా తనకు పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు తన కుమారుడు చల్లా భగీరథరెడ్డి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశం, బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ స్థితిగతులను సీఎంకు వివరించినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం రాజకీయాలపై వౌనంగా ఉండిన చల్లా క్రీయాశీల రాజకీయాలతో చురుగ్గా పని చేయడం ఆయన అభిమానుల్లోనే కాకుండా టీడీపీ శ్రేణుల్లోనూ ఆనందం నింపిందని చెప్పవచ్చు.