కర్నూల్

కోడుమూరు టీడీపీలో వర్గపోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడుమూరు, జూన్ 18:కోడుమూరులో అధికార టీడీపీలోని రెండు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి స్థానిక టీడీపీ నేత కేఈ రవీంద్రగౌడ్‌పై అదే పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ కేఈ రాంబా బు, మండల టీడీపీ కన్వీనర్ కేఈ మల్లికార్జునగౌడ్‌తో పాటు మరికొందరు ఆయన ఇంటికి వెళ్లి దాడి చేశా రు. దీంతో రవీంద్రగౌడ్ స్థానిక పోలీసులను ఆశ్రయించి దాడులకు పాల్పడిన వారిపై ఫిర్యాదు చేశారు. తాను పట్టణంలో టీడీపీ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి ఆ ఫలాలు నేరు గా ప్రజలకే అందేవిధంగా చర్యలు తీసుకుంటుంటే, అది చూసి ఓర్వలేక సొంత పార్టీలోని వారంతా తనపై కక్ష కట్టి దాడులకు పాల్పడుతున్నారని వాపోయాడు. అలాగే వారి వల్ల నాకు ప్రాణ హాని ఉందని రక్షణ కల్పించాలని బోరున విలపిస్తూ పోలీసులకు విన్నవించారు. ఈ మేరకు ఇక్కడి పోలీసులు దాడికి సంబంధించిన సం ఘటనపై విచారణ చేసి బాధితునికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలివ్వాలి
* సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
కర్నూలు ఓల్డ్‌సిటీ, జూన్ 18:నగరంలో సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు, పక్కా గృహాలు, రేషన్ కార్డులను తక్షణమే ఇవ్వాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గిడ్డయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీపీఐ నగర కార్యదర్శి పీ.గోవిందు అధ్యక్షతన కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గిడ్డయ్య మాట్లాడుతూ టీడీపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పేదలందరికీ పక్కా గృహాలు నిర్మించి గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పి అధికారం చేపట్టాక విస్మరించిందని మండిపడ్డారు. చంద్రబాబు అధికారం చేపట్టి 4 ఏళ్లు పూర్తయినా ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. ముఖ్యంగా నిరుపేదల సొంతింటి కల కలగానే మిగిలిపోయిందన్నారు. జన్మభూమి కార్యక్రమంలో 10 లక్షలకు పైగా ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారని వారందరికీ మంజూరు చేయాలన్నారు. ధర్నాలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌ఎన్ రసూల్, జిల్లా కార్యవర్గ సభ్యులు కె.జగన్నాథం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ.శేఖర్, ఏఐటీయుసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనోహర్ మాణిక్యం, సీపీఐ నగర సహాయ కార్యదర్శి జీ.మహేంద్ర, సభ్యులు రాము, శ్రీనివాసరావు, కుమార్, నరసింహులు, నాగేశమ్మ, రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.