కర్నూల్

కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జూన్ 18:రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి ఎన్‌ఎంఆర్, టైం స్కేల్, కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని ఏపీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ పెద్దఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక స్పెషల్ టీచర్ల ఉద్యోగాలను సృష్టించి వేలాది మంది కి ఉపాధి కల్పిస్తున్నట్లుగా 1986-1993 మధ్య కాలంలో తాత్కాలిక ప్రాతిపదికన ప్రభుత్వ శాఖల్లో, మున్సిపాలిటీ లు, యూనివర్శిటీల్లో వేలాది మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారన్నారు. ఆ తర్వాత కొందరు ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలని కోర్టును ఆశ్రయించగా 1994లో అప్పటి ప్రభుత్వం జీవో నెం. 212 జారీ చేసి, 1993 నవంబర్ 25వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని మాత్రమే క్రమబద్ధీకణకు అర్హులని నిబంధన విధించిందన్నారు. ఆవిధంగా నిబంధన విధించడం వల్ల వేలాది మందిలో కేవలం 20శాతం మంది మాత్రమే అర్హులయ్యారని, మిగిలిన 80శాతం మంది అనర్హులుగా ఉంటూ ఏ విధమైన ప్రయోజనాలు పొందకుండా దాదాపు 30 ఏళ్ల నుంచి కనీస వేతనానికి పని చేస్తూ వెట్టిచాకిరీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర హైకోర్టు జస్టిస్ బిఎస్‌ఏ స్వామి ఆ నిబంధనను సరలీకరించి, 1993 నవంబర్ 25వ తేదీ నాటి కంటే ముందు నియిమింపబడిన సిబ్బందినందరినీ పర్మినెంట్ చేయాలని తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. దీంతో ఆ తీర్పును అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్‌కు వెళ్లిందని, అప్పుడు సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను రూపొందిచుకునే హక్కు వుందంటూ ఉద్యోగుల అభ్యర్థనను తిరస్కరించిందన్నారు. అప్పటి నుంచి కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలకు తమ గోడు వినిపిస్తున్నామని, అయితే గత ఏడాది మే 26వ తేదీ ఉమ్మడి హైకోర్టు ద్వారా ఒక మధ్యంతర ఉత్తర్వును జారీ చేస్తూ, సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ 2006 మే 10వ తేదీ నాటికి పదేళ్ల సర్వీసు పూర్తయిన తాత్కాలిక ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. అంతేకాకుండా 10వ పే రివిజన్ కమిషన్ ప్రకారం 1993 నవంబర్ 25 నుంచి పని చేస్తున్న వారికి జీవో నెం.212 ఆదేశాలను తొలగించి దీర్ఘకాలికంగా సేవలందిస్తున్న వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిందన్నారు. ఈ సిఫారసు మేరకు ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న వారి సర్వీసును క్రమబద్ధీరించి, వారి జీవితాల్లో వెలుగు నింపాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి మనోహర్ మాణిక్యం, ఐద్వా నాయకురాలు నిర్మలమ్మ, ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నాగరమణయ్య, గిడ్డయ్య, జిలానీ, రామచంద్రరావు, సుబ్బారావు, వేణుగోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల హామీలు అమలు చేయాలి
* కలెక్టరేట్ ఎదుట వైఎస్‌ఆర్‌ఎస్‌యూ ధర్నా
కర్నూలు ఓల్డ్‌సిటీ, జూన్ 18:విద్యార్థులు, యువతకు టీడీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కోనేటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సమయంలో కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్యనందిస్తామని చెప్పి నేడు ఆమాట మరిచారని మండిపడ్డారు. ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు నేడు రోడ్డున పడ్డారన్నారు. గత ఏడాదికి సంబంధించి హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను నేటికీ ప్రభుత్వం విడుదల చేయకపోవడం దారుణమన్నారు. ముఖ్యంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, జీవో నెంబర్ 1, 25, 99లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ విద్యాసంస్థల్లో వౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ విద్యాసంస్థలను కాపాడాల్సిన అవసం ఎంతైనా ఉందన్నారు. వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఇంటర్ విద్యార్థులకు రూ. 4వేల ఉపకార వేతనం వచ్చేదని, కానీ నేడు చంద్రబాబు సర్కార్ కేవలం రూ. 2300 ఇస్తోందని, ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఉన్నత చదువులకు అడ్డుపడుతోందన్నారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి దేవపూజ ధనుంజయాచారి, విద్యార్థి సంఘం నాయకులు ప్రశాంత్, గౌతం, రవీంద్ర, రుద్రకుమార్, విజయ్, మధు, సాయికుమార్, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.