కర్నూల్

సిద్దాపురం ఎత్తిపోతల పనుల్లో జాప్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఏప్రిల్ 5:సిద్దాపురం ఎత్తిపోతల పథకం పనులు చేపట్టడంలో ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్ పనితీరుపై ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ శిల్పా మంగళవారం సిద్దాపురం ఎత్తిపోతల పథకం పనితీరును పరిశీలించేందుకు స్టేజ్-1 వద్దకు వెళ్లారు. అక్కడ ఇరిగేషన్ అధికారులు చిట్టిబాబు, ఉమమహేశ్వరయ్య, కాంట్రాక్టర్ చౌదరిలతో జరుగుతున్న పనుల గురించి చర్చించారు. ఒక కిలోమీటర్ పైపులైన్ నిర్మాణం పూర్తి అయితే మే నెలాఖరుకి ప్రాజెక్టు పూర్తయినట్లే అని అధికారులు తెలిపారు. దీంతో ఎమ్మెల్సీ శిల్పా మాట్లాడుతూ పనులను పరిశీలిస్తే మే నెలలోపు పనులు పూర్తయ్యేట్లు కనిపించడం లేదని అధికారులపై మండిపడ్డారు. అలాగే పనులు నత్తనడకన చేయించడం ఏంటని కాంట్రాక్టర్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంట్రాక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి రూ. 60 లక్షలు రావాల్సి ఉందని అందుకే పనుల్లో కొంత ఆలస్యం జరిగిందని తెలిపాడు. దీనిపై స్పందించిన శిల్పా డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ఇరిగేషన్ అధికారులు ప్రశ్నించారు. అలాగే పైపులైన్ పనులు పూర్తి కాకుండానే ఆయకట్టు పనులు ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. దీనిపై కాంట్రాక్టర్ మధుకర్ చెప్పిన సమాధానంపై శిల్పా మండిపడుతూ వెంటనే ఈ కాంట్రాక్టర్‌ను మార్చి ఇతరులకు పనులను అప్పగించాలని సిఇ చిట్టిబాబును ఆదేశించారు. సిద్దాపురం ఎత్తిపోతల పథకంలో జరుగుతున్న పనితీరును సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎమ్మెల్సీ వెంట నగర పంచాయతీ చైర్మన్ నూర్‌అహమ్మద్, టిడిపి నాయకులు వంగాల శివరామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, గౌస్, కృష్ణగౌడ్, పరశురాం, శివశంకరశర్మ, పుల్లారెడ్డి, తదితరులు ఉన్నారు.