కర్నూల్

ఎరువు ధర బరువే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జూన్ 24 : ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. పంటల సాగు కోసం విత్తనాలు, ఎరువులు అవసరమవుతాయి. అయితే గత ఏడాది కంటే ఈమారు విత్తనాలు, ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. విత్తనాల ధరలు షరా మామూలే. ఎరువుల కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలను ప్రతి ఏటా పెంచుకుంటూ పోతున్నాయి. ఈ ఏడాది కూడా ఎరువుల ధరలను పెంచాయి. దీంతో ఎరువుల బస్తా ధర గత ఏడాది కంటే రూ. 50 నుంచి రూ. 150 దాకా పెరిగింది. ప్రస్తుతం ఎరువుల ధరలు పెరగడంతో జిల్లా రైతులపై దాదాపు రూ. 120 కోట్ల దాకా అదనంగా భారం పడుతోంది. ఒకపక్క దిగుబడులు తగ్గడం, మరొక పక్క గిట్టుబాటు ధర కల్పించటంలో ప్రభుత్వం, పాలకులు విఫలం చెందడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి, వేరుశెనగ, కంది, వరి, మిరప, ఉల్లి వంటి పంటలు సాగు చేస్తున్నారు. పంట దిగుబడి ఎక్కువగా రావాలని రైతులు పోటీ పడి రసాయనిక ఎరువులను అధికంగా వాడుతున్నారు. ఎక్కువ శాతం రైతులు ఎకరాకు 12 నుంచి 20 బస్తాల వరకూ రసాయనిక ఎరువులు వాడుతున్నారు. వీటిని ఆసరగా చేసుకుని ఎరువుల కంపెనీలు ధరలను ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోతున్నా, ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 6.32 లక్షల హెక్టార్లలో రైతులు అన్ని రకాల పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది 4,86,896 మెట్రిక్ టన్నుల యూరియా, కాంప్లెక్స్, డీఏపీ, పోటాష్ వంటి ఎరువులు వాడారు. ఈ ఏడాది కూడా 4.5లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. కాగా విత్తనాలు, ఎరువుల ధరలతో పాటు సేద్యపు ఖర్చులు చుక్కలను చూపిస్తున్నాయి. ప్రభుత్వం సకాలంలో రుణాలు ఇస్తే కొంత మేరకు ఉపశమనం కలుగుతుంది. అయితే ప్రభుత్వం రైతులకు సకాలంలో రుణాలు అందించడంలో విఫలం కావడంతో రైతులు బ్యాంకుల చుట్టూ, వడ్డీ వ్యాపారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఈ విధంగా రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటుండగా ప్రభుత్వం, పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా ఎరువుల కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచినా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం. అలాగే ఎరువుల బస్తా బరువును 50కిలోల నుంచి 45 కిలోల వరకూ తగ్గిస్తూ ధరను మాత్రం పెంచడం జరుగుతుందని వ్యాపారులే పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎరవుల ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ఎరువు పాత ధర కొత్త్ధర
------- ------ -------
10:26:26 రూ. 1,040 రూ. 1,183
14:35:14 రూ. 1,120 రూ. 1,275
20:20:12 రూ. 870 రూ. 957
డీఏపీ రూ. 1080 రూ. 1250
ఎంవోపీ రూ. 630 రూ. 670
సూపర్ ఫాస్పేట్ రూ. 380 రూ. 465
17:17:17 రూ. 800 రూ. 989

ప్రతి ఏటా ఎరువుల ధరలు ఈ విధంగా పెరిగిపోతే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఈ ఏడాది నుంచైనా ప్రభుత్వం స్పందించి ఎరువుల ధరలను తగ్గించి ఆదుకుంటే బాగుటుందని అన్నదాతలు ఆశిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి.