కర్నూల్

పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, మే 10 : కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, ఎక్కడా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పూర్తిస్థాయిలో తీర్చిదిద్దుతున్నామని టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ శిల్పా మంగళవారం మండల పరిధిలోని నందిపల్లెలో సర్పంచ్ శ్రీదేవి ఆధ్వర్యంలో రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల సందర్భంగా కాలువ వెంట ఉన్న గ్రామాల్లో రోడ్లు బాగుపడుతున్నాయన్నారు. బావి తరాలకు నీరు పుష్కలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కాగా నందిపల్లెలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయ భాస్కర్‌రెడ్డి, ఎంపిపి చింతం నాగమణి, మహానంది ఆలయ కమిటీ చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, సాయిఈశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.