కర్నూల్

ఖరీఫ్‌కు సాగునీరందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, సెప్టెంబర్ 21: ఖరీఫ్ చివరి వరకు రైతులు సాగుచేసుకున్న పంటలకు నీరందిస్తామని రాప్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. లింగందినె్న రోడ్డులో వున్న 27వ లాక్‌ను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను గతంలో ఇక్కడకు వచ్చినప్పుడు కేసీ కెనాల్‌లో నీరు తక్కువగా ఉండడంతో రైతులు ఇబ్బందులను గమనించి వెంటనే కేసీని పరిశీలిస్తే మద్దెలవాగు ప్రాంతంలో సుమారు 300 క్యూసెక్యుల నీరు లీకవుతోందన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆ ప్రాంత రైతులు, అధికారుల సహాయంతో లీజేజీ ప్రాంతంలో ఇసుక బస్తాలను వేయడం వల్ల లీకేజీని అరికట్టగలిగామన్నారు. ఫలితతంగా కేసీ 27వ లాక్ వద్ద ప్రస్తుతం 4 అడుగుల నీరు ప్రవహిస్తోందన్నారు. కాలువకు నీరు రావడంతో రైతులు సంతోషంగా వున్నారన్నారు. వర్షాలు లేకపోయినా సాగునీరు కోసం రైతులు ఇబ్బందులు పడడం లేదంటే సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయమేనన్నారు. అలాగే తెలుగుగంగ పంట కాల్వల విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, వారం రోజుల్లో కాలువ పనులు ప్రారంభించే ఏర్పాట్లు చేస్తామన్నారు. కేసీ కెనాల్ నీటితో ఆళ్లగడ్డ పట్టణానికి సమీపంలో వున్న గనిగుంతలను నింపాలని, అలాగే చింతకుంట చెరువుకూడా నింపుతామన్నారు. ఫలితంగా బోర్లు రీచార్జి అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కేసీ కెనాల్ డీఈ భాస్కర్‌రావు, మార్కెట్‌యార్డు చైర్మన్ బీవీ రామిరెడ్డి, మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.