కర్నూల్

మొహర్రం వేడుకల్లో సినీనటుడు లక్ష్మీనారాయణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడుమూరు, సెప్టెంబర్ 21:పట్టణంలో జరిగిన మొహర్రం వేడుకల్లో సినీనటుడు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ముందుగా ఆయనకు పురోహితుడు అనీల్‌శర్మ, గుండంశర్మ, సుధాకర్‌శర్మ, రవిశర్మ, అభిమాని శివారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్థానిక భీమలింగేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఇక్కడ కొలువుదీరిన పీర్ల చావిళ్ల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన అనీల్‌శర్మ ఇంటి దగ్గర పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.
‘గాయం’తో సినీరంగ ప్రవేశం
అత్యంత ప్రేక్షకాదరణ పొందిన గాయం సినిమాతో సినీరంగ ప్రవేశం చేశానని సినీ నటుడు లక్ష్మీనారాయణ (టార్జన్) తెలిపారు. తన మిత్రుడైన అనీల్‌శర్మ కోరిక మేరకు కోడుమూరు వచ్చి మొహర్రం వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కుల మతాలకు అతీతంగా సాగే ఈ వేడుకలను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని కోరారు. మానవులకు కుల పిచ్చి ఉండకూడదని, ప్రజలంతా ఐకమత్యంగా ఉండి భారతీయ సంస్కృతిని కాపాడుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఇప్పటి వరకూ 150 తెలుగు సినిమాల్లో నటించానన్నారు. అందులో పోకిరి, మణి, మణి మణి, ఆర్య-2, లక్ష్యం, సాహసం, జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో నటించిన సినిమాలు తనకు మంచి గుర్తింపు ఇచ్చాయని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం అరవింద సమేత, శ్రీకాంత్ సినిమాల్లో నటిస్తున్నానన్నారు. రాబోయే రోజుల్లో ప్రధాన ప్రతినాయకుడిగా నటించాలనే కోరిక ఉందన్నారు. హీరో కావాలన్న కోరిక ఏమాత్రం లేదని ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇప్పటి నుంచి కామిడీ విలన్ పాత్రలు చేసేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు.