కర్నూల్

సీజన్ ముగిసినా వర్షపాతం అంతంత మాత్రమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, సెప్టెంబర్ 21:ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క నెలలో కూడా సరైన వర్షపాతం నమోదవలేదు. సీజన్ ప్రారంభమయ్యే జూన్‌లో 77.2మి.మీ వర్షపాతానికి గానూ 73.5 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో జూలైలోనైనా మంచి వర్షాలు కురిసి పంటలు బాగా వస్తాయని ఆశించిన అన్నదాతల ఆశలు అడియాశలే అయ్యాయి. జూలైలో 117.7మి.మీకు గానూ 52.9, ఆగస్టులో 135మి.మీకు గానూ 65.8మి.మీ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌తో ఖరీఫ్ సీజన్ ముగుస్తుంది. ఈ నెలలో కూడా 125.7 మి.మీకు గానూ 67.7 మి.మీ వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సీజన్ మొత్తానికి 455.1 మి.మీ గానూ కేవలం 259.9 మి.మీ వర్షపాతం నమోదైంది. వారం పది రోజుల్లో సీజన్ ముగిసి రబీ సీజన్ ప్రారంభం కానుంది అయినా 46 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. గత ఏడాది ఖరీఫ్ సీజన్ ముగిసే నాటికి 17 శాతం వర్షపాతం ఎక్కువగా నమోదు కాగా ఈ ఏడాది ఏకంగా 46 శాతం వర్షపాతం తక్కువగా నమోదై జిల్లా అంతటా కరవు ఛాయలు ఏర్పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 36 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. దీంతో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు జిల్లా మొత్తాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించి కరవు నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.