కర్నూల్

దాడులు చేయించాల్సిన అవసరం బీజేపీకి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పత్తికొండ, అక్టోబర్ 13:రాజ్యసభ సభ్యుడు, టీడీపీ నేత రమేష్‌పై ఐటీ దాడులు చేయించాల్సిన అవసరం బీజేపీకి లేదని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఆస్తులు, సంస్థలపై ఆదాయ పన్ను అధికారులు తనిఖీలు నిర్వహిస్తే టీడీపీ నాయకులు బీజేపీని విమర్శలు చేయడం న్యాయం కాదన్నారు. వ్యాపార సంస్థలు సకాలంలో పన్నులు చెల్లించకపోతే ఆదాయ పన్నుశాఖ అధికారులు తనిఖీలు చేయడం సహజం అన్నారు. అయితే టీడీపీ నాయకులు దీని వెనుక బీజేపీ హస్తం ఉందని విమర్శించడం తగదన్నారు. పలు ప్రభుత్వ ప్రాజెక్టు నిర్మాణాల్లో కోట్లాది రూపాయాల అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయని, దీంతో నిర్మాణం చేపట్టిన కంపెనీతో రమేష్‌కు సంబంధాలు ఉండడంతో ఐటీ అధికారులు తనిఖీలు చేశారే కానీ బీజేపీ ప్రమేయం లేదన్నారు. సీఎం చంద్రబాబుకు కోర్టు నోటీసులు జారీ చేస్తే దాన్ని కూడా రాజకీయం చేసి ప్రధాని మోదీ హస్తం ఉందని ఆరోపించడం తగదన్నారు. కోర్టుకు సకాలంలో హాజరుకాకపోతే నోటీసులు వస్తాయని సీఎం బాబుకు తెలియకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో ఏ విషయం జరిగినా పనిగట్టుకుని టీడీపీ నాయకులు బీజేపీ, ప్రధానమంత్రి మోదీపై విమర్శలు చేయడం తగదన్నారు.
గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులకు గెజిటెడ్ హోదా కల్పించాలి
* ఈఓఆర్‌డీ-2 పోస్టులను పునరుద్ధరించాలి * ఏపీ ఎన్‌జీఓ చైర్మన్ పీ.అశోక్‌బాబు
కర్నూలు ఓల్డ్‌సిటీ, అక్టోబర్ 13:గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులకు గెజిటెడ్ హోదా కల్పించాలని, ఈఓఆర్‌డీ-2 పోస్టులను తక్షణమే పునరుద్ధరించాలని ఏపీ ఎన్‌జీఓ చైర్మన్ పీ.అశోక్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవీడీ.ప్రసాద్ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పీ.అశోక్‌బాబు మాట్లాడుతూ ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. గ్రామ పంచాయతీలను జనాభా, ఆదాయాలకు అనుగుణంగా పునర్ వ్యవస్థీకరించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవీడీ.ప్రసాద్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-2, గ్రేడ్-3, గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.