కర్నూల్

కాంగ్రెస్‌తోనే ప్రత్యేక హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, అక్టోబర్ 13:రాష్ట్రాబివృద్ధి ప్రత్యేక హోదాతోనే సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాహుల్‌గాంధీ ప్రత్యేక హోదా ఫైలుపైనే తొలి సంతకం చేయనున్నారని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ స్పష్టం చేశారు. ‘ఇంటింటికీ కాంగ్రెస్’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె డోన్ పట్టణంలోని తారకరామనగర్, నెహ్రూనగర్‌లలో పర్యటించి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా అన్ని పార్టీలు సంతకం చేశాయని, అయితే కాంగ్రెస్ పార్టీనే దోషిగా చిత్రీకరించడం సబబు కాదన్నారు. టీడీపీ, బీజేపీ వల్ల గత నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. ఏపీకి జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాతో పాటు రైతులందరికీ రూ. 2 లక్షల వరకూ రుణమాఫీ చేస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. కాంగ్రెస్ పార్టీని తాము వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఎన్ని కష్టాలెదురైనా కార్యకర్తలకు అండగా వుంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో డోన్ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మాకు ఎలాంటి వ్యాపారాలు లేవని, ప్రజల కోసమే పోరాడుతామన్నారు. కాంగ్రెస్ హయాంలో తాము డోన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామని, ప్రజల ఆశీస్సులతో డోన్‌లో గెలిచి తీరుతామని సుజాతమ్మ ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ నేతలను కలిసిన సుజాతమ్మ
ఇంటింటికీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా శనివారం కోట్ల సుజాతమ్మ టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. టీడీపీ సీనియర్ నాయకులు మర్రి గోవిందరాజు, కేఈ బంధువైన కేఈ మద్దిలేటి, టీడీపీ లీగల్ సెల్ నాయకులు ఆంజనేయగౌడ్ ఇళ్లకు వెళ్లి పలకరించారు. అలాగే వారితో కాసేపు చర్చలు జరిపారు. పార్టీ కార్యక్రమంలో భాగంగానే వారిని కలిసినట్లు ఆమె తెలిపారు.
కాంగ్రెస్‌లో చేరిన వైసీపీ కార్యకర్తలు
కాంగ్రెస్ పార్టీకి చెందిన లారీ బాషా ఆధ్వర్యంలో 50 మంది వైసీపీ కార్యకర్తలు కోట్ల సుజాతమ్మ ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ముందుగా ఆమె తారకరామనగర్‌లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.