కర్నూల్

98 శాతం ప్రజలు సంతోషంగా ఉన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, డిసెంబర్ 6:నియోజక వర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజలతో మమేకమై ప్రజలతో చర్చించగా 98 శాతం మంది సంతోషంగా ఉన్నారని తెలిసిందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో గురువారం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఆదరణ పథకం-2 పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో భాగంగా ఆదరణ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ఈ పథకం విజయవంతం కావడంతో ఆదరణ పథకం-2 ద్వారా బీసీ కులాలకు స్వయం ఉపాధి కోసం యునిట్లు పంపిణీ చేశామన్నారు. అందులో శ్రీశైలం నియోజకవర్గానికి 1,635 యూనిట్లు మంజూరు కాగా 750 యునిట్లు లబ్ధిదారులకు ఇచ్చామన్నారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే యూనిట్లు ఇస్తామన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రతి కుటుంబం ఏదో ఒక సంక్షేమ పథకాన్ని పొంది ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ పథకాలను అందరికీ అందించిన ఘనత టీడీపీదే అన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో చాలా అవినీతి జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అవినీతి వల్ల సామాన్య ప్రజలు ఇప్పటికీ బాధపడుతున్నారన్నారు.
శిల్పా అధికారులను భయపెడుతున్నారు
ప్రతిపక్ష పార్టీకి చెందిన శిల్పా చక్రపాణిరెడ్డి అధికారులను భయాందోళనకు గురి చేయడంతో పాటు వేధింపులకు పాల్పడుతున్న వాయిస్ రికార్డు తన వద్ద ఉందని ఎమ్మెల్యే బుడ్డా తెలిపారు. బండి ఆత్మకూరు మండలంలో వైసీపీకి చెందిన కొందరు నాయకులు ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్నారు. అధికారులు ఈ భూమిని స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంపిణీ చేయాలన్న ఉద్దేశ్యంతో ఆక్రమణదారులపై అధికారులు చర్యలు తీసుకుంటుంటే శిల్పా చక్రపాణిరెడ్డి ఫోన్ చేసి భయపెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు నా వద్ద ఉన్నాయన్నారు. అలాంటి శిల్పా నాపై అవినీతి ఆరోపణలు చేయడం అన్యాయమన్నారు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చానని వారి కష్టాలు తెలుసు అన్నారు. సాగు నీటిపై శిల్పాకు సరైన అవగాహ లేదని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడన్నారు. కొందరు రైతులు ఆలస్యంగా ఎత్తిపోతల పథకం కింద పంటలు వేసుకున్నారని, వారికి పంట పూర్తయ్యేంత వరకూ నీరందిస్తామన్నారు.
ఎమ్మెల్యే గారూ.. మీ చూట్టూ ఉన్న వాళ్లు మోసం చేస్తారు
‘‘ఎమ్మెల్యే గారూ.. మీరు చాలా మంచివారేనని.. మీకు నా ఓటు వేస్తా.. అయితే మీ చూట్టూ ఉన్న వాళ్లు మీమ్మల్ని తప్పుదారి పట్టించి మోసం చేస్తారని ఆత్మకూరు పట్టణవాసి సుగుణబాయి పేర్కొన్నారు. సభలో ఎమ్మెల్యే బుడ్డా మహిళలను మాట్లాడమని కోరగా ఆత్మకూరు పట్టణానికి చెందిన పొదుపు లక్ష్మి సభ్యురాలు సుగుణబాయి మాట్లాడింది. టీడీపీ ప్రభుత్వం బాగా పని చేస్తోందని మీరు అందరికీ ఇళ్లు, పింఛన్లు ఇప్పించారన్నారు. పట్టణంలోని అన్ని కాలనీల్లో రోడ్లు కూడా నిర్మించారన్నారు. అయితే మీ చుట్టు పక్కన ఉన్న వాళ్లు మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆమె ముక్కుసూటిగా చెప్పింది.
సాక్షర భారత్ ఉద్యోగుల
సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తా
* ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
ఆత్మకూరు, డిసెంబర్ 6:సాక్షర భారత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో చర్చిస్తానని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం సాక్షర భారత్ సమన్వయకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షర భారత్‌లో 21 వేల మంది విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. అయితే 2018 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం వీరిని తొలగించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను నిలిపివేసినా, రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేస్తుందన్నారు. ఆర్థికంగా వనరులు సేకరించుకుని కేంద్ర ప్రభుత్వం నిలిపి వేసిన పథకాలను పునఃప్రారంభిస్తుందన్నారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు రూ. 340 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. అయితే ఈ ఫైలు ఆర్థిక శాఖ వద్ద పరిశీలనలో ఉందన్నారు. అక్కడి నుంచి వచ్చిన వెంటనే ఉద్యోగులకు రావాల్సిన 6 నెలల గౌరవ వేతనం ఇస్తారన్నారు. ఈ సమస్యల గురించి ఇతర ఎమ్మెల్యేలతో చర్చించి అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు.