కర్నూల్

కర్నూలును స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 6:కర్నూలును స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతామని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. నగరంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బాడ్మింటన్ టోర్నమెంట్-2018 పోటీలను గురువారం ఎంపీ టీజీ కలెక్టర్ సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ టీజీ మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడాకారులు, పతకాలు సాధించినవారు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నారన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 600 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. కలెక్టర్ సత్యనారాయణ క్రీడల పట్ల ఆసక్తి, అభిరుచి ఉన్న వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఎంతో పాటుపడుతుందన్నారు. క్రీడలు మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయన్నారు. చిన్నతనం నుంచే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసిక్తి పెంచుకుంటే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవచ్చు అన్నారు. ఇలాంటి పోటీలు మన జిల్లాలో నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు. జిల్లా బాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు టీజీ భరత్ మాట్లాడుతూ ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకూ జరిగే ఈ టోర్నమెంట్‌లో మొదటి రెండు రోజులు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతాయన్నారు. 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు. సింథటిక్ కోర్టు ఏర్పాటు చేస్తే బాగుటుందని సూచన చేశారు.
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
* మంత్రి భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ, డిసెంబర్ 6: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని శ్రీ భారతీవిద్యామందిరం ఉన్నత పాఠశాలలో గురువారం క్రీడా పోటీలను పాఠశాల కమిటీ అధ్యక్షులు టీఎంసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో మంత్రి క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమన్నారు. కష్టపడి చదివే విద్యార్థులకు తమ వంతు సహకారం వుంటుందన్నారు. క్రీడల వల్ల శారీరక ఆరోగ్యం బాగుపడుతుందని, ఆరోగ్యంగా వుంటేనే చదువుకోవడానికి శరీరం సహకరిస్తుందన్నారు. పాఠశాల కమిటీ అధ్యక్షులు టీఎంసీ మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు, చదువు రెండు కళ్లు లాంటివన్నారు. అందుకని వీటిని నిర్లక్ష్యం చేయవద్దన్నారు. చదువుతో పాటు విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. జిల్లాలోని 17 పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారన్నారు.