కర్నూల్

నేటి నుంచి మహానందిలో మహదాశీర్వచన దర్శనం:ఇఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, మే 22: మహానందిలో ప్రతి భక్తుడికి అందుబాటులో ఉండే విధంగా మహాదాశీర్వచన దర్శనాన్ని సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇఓ డాక్టర్ శంకర్‌వరప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన దేవస్థానం కార్యాలయంలో దీనిపై సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ మహానంది క్షేత్రానికి వచ్చిన భక్తులు విఐపిల మాదిరిగానే దర్శనం చేసుకొనే విధంగా మహాదాశీర్వచన దర్శనాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈ దర్శనం టిక్కెట్ ధర రూ.351లుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ టిక్కెట్ తీసుకున్న దంపతులకు స్వామివారి స్పర్శ దర్శనంతో పాటు అమ్మవారి ఆలయంలో హారతి, రెండు లడ్డూలు ప్రసాదం, ఒక శేషవస్త్రం, ఒక జాకెట్ పీసును అందిస్తూ వేద పండితులచే ఆశీర్వచనం ఉంటుందన్నారు. కుటుంబంలో 12సంవత్సరాల పిల్లలకు ఈ టిక్కెట్ వర్తిస్తుందని ఆపైబడిన వారు మరలా టిక్కెట్ తీసుకోవాలన్నారు. దీనిని శాస్త్రోక్తంగా సోమవారం ఉదయం 9గంటలకు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, ఎఇ మురళీధర్‌రెడ్డి, వేద పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వరశర్మ, సిబ్బంది నాగమల్లయ్య, హరినాథ్, నీలకంఠం, ఆలయ ఇన్‌స్పెక్టర్ సురేంద్రనాథ్‌రెడ్డి, నాగరాజు, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.