కర్నూల్

నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 22:నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఫకీరప్ప ఆదేశించారు. ముఖ్యంగా పేకాట, మట్కాను పూర్తిగా అరికట్టాలన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు పటిష్టంగా పని చేస్తేనే బాధితులకు న్యాయం జరిగి నిందితులకు శిక్ష పడుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకూ నమోదైన కేసుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలు గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, యుఐ కేసుల గురించి ఆరా తీశారు. స్థానిక పోలీసు అధికారులు ఫ్యాక్షన్ పికెట్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, రిజిస్టర్లలో సంతకాలు చేయాలన్నారు. ఫ్యాక్షన్ సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వచ్చే నెల నేషనల్ లోక్ అదాలత్‌లో రాజీ అయ్యే కేసులు పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో సాంకేతిక నైపుణ్య వినియోగం పెరగాలన్నారు. రద్దీ కూడళ్లలో సీసీ టీవీలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలకు ముందే ఫ్యాక్షన్ గ్రామాల జాబితా తయారు చేయాలన్నారు. హిస్టరీ షీట్, రౌడీషీట్ జాబితాలను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమైన కేసులను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోవాలని సబ్‌డివిజన్ స్థాయి అధికారులను ఆదేశించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా సబ్ డివిజన్‌ల పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఐక్యూ సొల్యూషన్స్ కరుణాకర్‌రెడ్డి టీమ్ సభ్యులు సీడీఆర్ అనలసిస్ సాఫ్‌టవేర్(టవర్‌డంప్, టవర్ లొకేషన్, ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ డేటా రిపోర్టు) గురించి పోలీసు అధికారులకు వివరించారు.
కార్యకర్తలే కొండంత అండ
* మంత్రి భూమా అఖిలప్రియ
చాగలమర్రి, జనవరి 22: భూమా కుటుంబానికి కార్యకర్తలే కొండంత అండ అని మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. మంగళవారం స్థానిక కోటగడ్డ వీధిలో, పాత బ్యాంకు వీధిలో, వినాయక నగర్‌లో మంత్రి సమక్షంలో హుసేన్‌బాషా తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్యకర్తల అండతోనే తమ కుటుంబం ఈ స్థాయికి చేరిందన్నారు. భూమా దంపతులు చనిపోగానే తమ కుటుంబానికి దిక్కు ఎవరు ఉండరని, ప్రత్యర్థులు భావించారని, కాని కార్యకర్తల అండగా నిలిచారని ఆమె తెలిపారు. కార్యకర్తల రుణాన్ని ఎప్పటికి తీర్చుకోలేమని మంత్రి స్పష్టం చేశారు. తమ తల్లి భూమాశోభానాగిరెడ్డి చనిపోయినా నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి గెలిపించడం తమ కుటుంబంపై గల ఆదరాభిమానాలకు నిదర్శనమన్నారు. తాము కూడా ప్రజలనమ్మకాన్ని వమ్ముచేయకుండ అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. పెన్షన్ పైకాన్ని పెంచడమేకాక ముస్లిం మైనార్టీల అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయించారని ఆమె తెలిపారు. నగళ్లపాడు గ్రామంలో గ్రామదర్శినిలో ఆమె ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.