కర్నూల్

నాడు ఎద్దుల బండ్లు, సైకిళ్లు.. నేడు ఆటోలు, ట్రాక్టర్ల ట్యాక్స్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జనవరి 22:నాడు టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఎద్దులబండ్లు, సైకిళ్ల ట్యాక్స్ రద్దు చేయగా నేడు సీఎం చంద్రబాబు ఆటోలు, ట్రాక్టర్ల ట్యాక్స్ రద్దు చేశారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఎన్‌ఎండీ.్ఫరూఖ్ పేర్కొన్నారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అధ్యక్షతన మంత్రి ఫరూక్ ఆటో డ్రైవర్లతో కలిసి సీఎం చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనంతరం మంత్రి పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ 1983లో ఎన్టీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు సైకిల్‌తో పాటు ఎద్దుల బండ్లకు ట్యాక్స్ ఉండేదని, దీంతో ఎన్టీఆర్ పేదలపై పన్నుల భారం ఉండకూడదని వెంటనే రద్దు చేశారని గుర్తుచేశారు. అలాగే ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే ఆటో డ్రైవర్లపై జీవితకాలపు పన్ను(లైఫ్ ట్యాక్స్), ట్రాక్టర్లకు త్రైమాసిక పన్ను రద్దు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. ఇక ప్రభుత్వాసుపత్రిలో రూ. 120 కోట్ల వ్యయంతో క్యాన్సర్ ఆసుపత్రితో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, ఓర్వకల్లు పరిశ్రమల హబ్‌గా ఏర్పడుతోందని ఈ నేపథ్యంలో కర్నూలుకు ఎయిర్‌పోర్టు అవసరం చాలా ఉందన్నారు. సోమిశెట్టి మాట్లాడుతూ ఆటోలు, ట్రాక్టర్లకు లైఫ్ ట్యాక్స్ రద్దు చేయడం దేశంలోనే ఇదే తొలిసారి అన్నారు. పింఛన్ల మొత్తం పెంపు, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద ఆర్థిక చేయూత, తదితర ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే ప్రతిపక్ష పార్టీ నాయకులకు భయం పుట్టుకొందన్నారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర నిధులతోనే పూర్తవుతుందని కొందరు కేంద్ర మంత్రులే ప్రకటిస్తుంటే మరో కేంద్ర మంత్రి గడ్కరీ పోలవరానికి కావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందనడం హాస్యాస్పదం అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబించడమే కాకుండా ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం 2 నెలల్లో పతనం కానుందన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌లో కేసీఆర్, జగన్ తప్ప మరొక లేరని, 2019 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులదే గెలుపని, ప్రధాని ఎవరనేది నిర్ణయించేది కూడా సీఎం చంద్రబాబే అన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు విశ్వరూపం చూసి వైసీపీ నాయకులకు భయం పుట్టుకొందన్నారు. టీడీపీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ప్రజలకు అవసరమైన పథకాలు ప్రవేశపెట్టిందని, దీంతో ప్రజలు చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతున్నారని, దానిని చూసి జీర్ణించుకోలేక వైసీపీ నేతలు పిచ్చిపట్టినట్లు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారన్నారు. 90శాతం మంది ప్రజలు సంతృప్తితో ఉన్నారని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వాసుత్రులు
* రూ. 3.15 కోట్లతో ప్రసూతి భవనం ఆధునీకరణ * వైద్య విద్య, మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్
కర్నూలు, జనవరి 22:కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని వైద్య విద్య, మైనారిటీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలో మంగళవారం మంత్రి ఫరూక్ రూ. 3.15 కోట్ల అంచనా వ్యయంతో పాత ప్రసూతి భవనం ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ఎన్‌టీఆర్ వైద్య సేవ ద్వారా 1046 జబ్బులకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాన్పులకు అవసరమైతే సిజేరియన్ చేయడానికి ఎన్‌టీఆర్ వైద్య సేవ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇక ఆసుపత్రి ఆవరణలోని లెక్చర్ హాల్ మరమ్మతులకు రూ. 10 లక్షలు, మిలీనియం బ్లాక్ మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. మాతా, శిశు మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఆసుపత్రుల ఆధునీకరణ, సీటీస్కాన్ తదితర ఆధునిక వైద్య పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం పుష్కలంగా నిధులు ఇస్తోందన్నారు. వైద్యులు ప్రత్యక్ష దైవాలని, అలాంటి వారు రోగులకు మంచి వైద్య సేవలు అందించాలన్నారు. కర్నూలు ఆసుపత్రి ఇప్పటికే మంచి పేరు సంపాదించుకుందన్నారు. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ మిలీనియం బ్లాక్ ఏర్పాటుకు కృషి చేయాలని మంత్రి ఫరూక్‌కు విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆసుపత్రి అభివృద్ధి, ఆధునిక పరికరాల కొనుగోలుకు సీఎం చంద్రబాబు కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కర్నూలు ఆసుపత్రి సేవలు అందిస్తుందన్నారు. ఈ ఆసుపత్రి నానాటికీ అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లోకి కర్నూలు ఆసుపత్రిలో ఓపీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, ఇందుకు డాక్టర్లను అభినందిస్తున్నామన్నారు.
బట్టమేక పక్షులను సంరక్షించుకోవాలి
* దేశవ్యాప్తంగా 200 పక్షులే.. * రోళ్లపాడు వన్యప్రాణి కేంద్రాన్ని సందర్శించిన మీ బృందం
మిడుతూరు, జనవరి 22:ప్రపంచంలోనే అంతరించిపోతున్న పక్షి జాతుల్లో ఒకటైన ‘ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్’ బట్టమేక పక్షులను సంరక్షించుకోవాలని ‘మీ’ కమిటీ బృందం సభ్యులు సూచించారు. ‘మీ’ బృందం చైర్మన్, విశ్రాంత ఐఎఫ్‌ఎస్ అధికారి డా. ఎస్‌కె.ఖండూరి, బృందం సభ్యులు కేఎఫ్‌ఆర్‌ఐ సైంటిస్టు జైసన్, ప్రపంచ బ్యాంకు కన్సల్టెంట్ డా. అరుణ్‌మని డిక్సిట్, ఐఎఫ్‌ఎస్ అధికారి వినోద్‌కుమార్ మంగళవారం మండల పరిధిలోని రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. రాష్ట్రంలోని పర్యాటక క్షేత్రాలను అభివృద్ధి చేయాలంటే ఏయే పనులు చేపట్టాలో ముందుగా తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో పర్యటిస్తున్న ఈ బృందం రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల కోసం కేంద్రం పరిధిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా కేవలం 200 బట్టమేక పక్షులు మాత్రమే సంచరిస్తున్నాయని, ఈ పక్షుల సంచారం ఏపీతో పాటు రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటక పరిసర ప్రాంతాల్లో ఉందన్నారు. ప్రపంచ పటంలో రోళ్లపాడు వన్యప్రాణి కేంద్రానికి గుర్తింపుతెచ్చిన బట్టమేక పక్షుల సంతతి ఈ ప్రాంతంలో పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాగా శాంచురీ పరిధిలో జింకల సంతతిని తగ్గించేందుకు, జింకల వల్ల నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం పెంచాలనే విషయాలపై కూడా నివేదిక అందజేస్తామన్నారు.