కర్నూల్

బ్రాహ్మణుల సంక్షేమంలో రాజకీయం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోనిటౌన్, మే 24: రాష్ట్రంలోని పేద, నిరుపేద బ్రాహ్మణుల సంక్షేం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా జెండా, ఎజెండాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, సంక్షేమంలో రాజకీయాలు చేయడం తగదని రాష్ట్ర అర్చక పౌరోహిత సంఘం అధ్యక్షులు వెల్లాల మధుసూదన్ శర్మ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ విశాఖ శారద పీఠం పీఠాదిపతులు స్వరూపానంద సరస్వతిపై ఆరోపణలు చేయడం విచారకరమన్నారు. నిజమైన పేద బ్రాహ్మణులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని, స్వామిజీలను విమర్శలు చేయడం వల్ల ఏమి రాదని, వారు కాషాయ వస్త్రం ధరించి ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉపాధి చాణుక్య పథకం వల్ల రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు సహకరించలేదని, ఎవరికి కూడా ఉపాధి దొరకలేదన్నారు. అలాగే నిరుపేదల పిల్లలకు 1 నుంచి 10 వరకు విద్య అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం నేడు అనేక నిబంధనలు పెట్టిందని, దీనివల్ల అర్హులైన బ్రాహ్మణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందువల్ల బ్రాహ్మణ సంక్షేమానికి కలిసి కట్టుగా పాటు పడాలని పిలుపు నిచ్చారు.